అమాయక యువతులను మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకొని వారిని వ్యభిచార గృహాలకు అమ్ముతున్న ఎంతో మంది దుర్మార్గుల గుట్టు పోలీసులు రట్టు చేశారు.  ఇక సినిమా ఇండస్ట్రీలోకి మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కంటూ వస్తున్న యువతులకు తమకు ఇండస్ట్రీ పెద్దలు తెలుసని చెప్పి నమ్మించి వ్యభిచారుణులుగా చేస్తున్న దళారులు ఎంతో మంది ఉన్నారు.  ఆ మద్య అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.   తెలుగు నిర్మాత కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రకళ ఆ రాకెట్‌ను నడిపిస్తున్నారు. ఈ ఇద్దర్నీ చికాగో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అమెరికాలో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తామంటూ హీరోయిన్లను తీసుకువెళ్లి.. అక్కడ వాళ్లతో వ్యభిచారానికి పాల్పడుతున్నారు. ఈ ఉదంతం టాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ కలవరం రేపింది. స్టార్ నైట్స్ పేరుతో యువ తారలను తీసుకువెళ్లి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని తేలింది. మొత్తానికి ఈ విషయం కాస్త  టాలీవుడ్‌ను కుదిపేశాయి.  తాజాగా ఇప్పుడు బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది.  నృత్య ప్రదర్శనల పేరిట అమ్మాయిలను విదేశాలకు తరలించి అక్కడ వారితో వ్యభిచారం చేయిస్తున్న బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. అంధేరీలోని లోఖండావాలా సమీపంలో బాలీవుడ్ హబ్ పేరిట డ్యాన్స్ స్కూల్ నిర్వహించే అగ్నేస్ హమిల్టన్ (56) పలు బాలీవుడ్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.   
How tollywood sex racket unfolded by American police
అమ్మాయిలను విదేశాలకు పంపుతున్నట్టు విచారణలో తేలడంతో ఆమెను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కెన్యాలోని ఓ హోటల్‌లో నృత్య ప్రదర్శనకు వచ్చిన యువతి వ్యభిచారం చేస్తూ అక్కడ పోలీసులకు పట్టుబడటంతో ఆగ్నెస్ పేరు బయటకు వచ్చింది. యువతులకు మాయమాటలు చెప్పి మోసం చేసి  ఒక్కొక్కరికి రూ.40 వేల వరకు వసూలు చేసి కెన్యా, బహ్రెయిన్, దుబాయ్ తదితర దేశాలకు అమ్మాయిల్ని పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వారి సమాచారం ఆధారంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అగ్నేస్‌ను అరెస్ట్ చేసి ప్రశ్నించారు.   అగ్నేస్ ఫేస్‌బుక్ ఖాతాలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులుతో దిగిన ఫోటోలు కనిపించడం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: