టాలీవుడ్ పల్స్ పట్టుకోవడంలో ఇన్నాళ్ళకు ఆ ఆమ్మడు సక్సెస్ అయినట్లుంది. ఏదో పక్కింటి అమ్మాయి పాత్రలు, పరికిణీ ఓణీలతో పరువాలు దాచితే యూజ్ ఉండదని డిసైడ్ అయి సైడ్ రూట్ పట్టిందంటున్నారు. ఇకపై అందంతోనే అదరగొడతాను కాసుకోండంటోంది. నిజానికి ఈ భామకు అందమే కాదు, అభినయం కూడా బాగానే ఉంది. కానీ ఇండస్ట్రీ లో రెండూ పండించాలని లేకపోతే లక్కు ఎక్కడో లాక్ అయిపోయి చాన్సులు లేకుండా పోతాయని తెలివిగా ఆలోచించింది.


ఆమె పేరు మాళ్లవికా నాయర్. ఈ మళయాలీ ముద్దు గుమ్మ తెలుగులో చాల కాలం క్రితమే అరెంగేట్రం చేసి అందగత్తె అనిపించుకుంది. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో ఆమె చూడ చక్కని పాత్రలో నటించింది. ఆ తరువాత కళ్యాణమే వైభోగమే నటించి ఫ్యామిలీ ఆడియెన్స్ దగ్గర మార్కులు కొట్టేసింది. ఈ మధ్య వచ్చిన మహానటిలోనూ మాళవిక మెరిసింది. అన్నీ క్లీన్ ఇమేజ్ ఉన్న పాత్రలే రావడంతో ఎక్కడ హైప్ క్రియేట్ కాలేదు. దాంతో షాకింగ్ డెసిషన్ తీసుకుంది మాళవిక.


ఈ రోజు విడుదల అవుతున్న  టాక్సీవాలాలో అసలు  హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సంగతెమో కానీ ఈ కొసరు హీరోయిన్ మాళవిక మాత్రం ఓ రేంజిలో హాట్ హాట్ అందాలను వండి వడ్డించిందట. నిజానికి ఈ మూవీలో మాళవిక పాత్ర కూడా చాలా కీలకమట. ఈ మూవీ హిట్ అయితే తనకు గ్లామర్ రోల్స్ దండిగా వస్తాయని నమ్ముతున్న ఈ అమ్మడు ఇకపై స్కిన్ షో చేసేందుకు ఎలాంటి మొహమాటం లేదని చెప్పకనే చెబుతోంది.


 ఆమె లేటెస్ట్ గా హాట్ హాట్ ఫోజులతో ఫొటో షూట్ చేసి మరీ ఫిల్మ్ మేకర్లకు కొత్త సిగ్నల్స్ పంపింది. మరి మాళవిక  ఆగనిక అంటోంది. తనతో సినిమాలు తీసే వారుంటే తెర తీస్తానని అంటోంది. ఆ లక్కీ చాన్స్ ఎవరికో


మరింత సమాచారం తెలుసుకోండి: