తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా గా ఎంట్రీ ఇచ్చారు.  పాత తరం చిత్రాల్లో విలన్ గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్న చలపతిరావు తనయుడు రవిబాబు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.  మొదటి చిత్రం ‘అల్లరి’తో దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.  ఆ తర్వాత ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించి షభాష్ అనిపించుకున్నాడు.   నిర్మాత, దర్శకుడుగా రవిబాబు విభిన్న రంగాల్లో తనదైన మార్క్ చాటుకుంటున్నాడు. 
Image result for adugo movie
తాజాగా రవిబాబు మరో ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’తో ఆ మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  వాస్తవానికి ఈ చిత్రం గ్రాఫిక్ టెక్నాలజీ బాగానే వాడారు.  దాంతో పాటు ఓ పంది పిల్ల లైవ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలు తీశారు.  అయితే ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుందని భావించారు..చిత్ర యూనిట్.  కానీ పందిపిల్ల ప్రధాన పాత్రలో, గ్రాఫిక్స్ తో తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం కాగా, రవిబాబుకు భారీ నష్టం మిగిలిందట. 
Image result for adugo movie
ఒక పందిపిల్లతో ఈ తరహా చిత్రాలు తీయం ఇక్కడ జనాలకు పెద్దగా కిక్ అనిపించలేదు.  పందిపిల్లతో సినిమా అని తన సాహస నిర్ణయాన్ని ప్రకటించి, సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచిన ఆయన, సినిమాలోని కంటెంట్ విషయమై శ్రద్ధ పెట్టలేదని, ప్రమోషన్ కూడా అంతంతమాత్రంగానే సాగడంతో ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయిందని సినీ విమర్శకులు అంటున్నారు.   ఈ చిత్రం షూటింగ్ కన్నా, గ్రాఫిక్స్ కు అధికంగా ఖర్చు పెట్టిన రవిబాబు కోట్లు నష్టపోయాడని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: