టాలీవుడ్ లోకి ఇప్పటి వరకు ఎంతో మంది వారసత్వపు హారోలు వచ్చారు.  ప్రముఖ హాస్య దర్శకులు వివివిసత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ ‘అల్లరి’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  తన మొదటి సినిమా టైటిల్ అల్లరితోనే బాగా పాపులర్ అయ్యారు.  అల్లరి నరేష్ కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  సీనియర్ హీరోలు రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి కామెడీ హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించ సమయంలో అల్లరి నరేష్ కామెడీ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 
Image result for seematapakai
‘సుడిగాడు’ సినిమా తర్వాత అల్లరి నరేష్ కి ఏ సినిమా కలిసి రావడం లేదు.  మల్టీస్టారర్ సినిమాల్లో నటించినా అల్లరి నరేష్ గుర్తింపు రావడం లేదు.  ఆ మద్య సునీల్‌తో క‌లిసి సిల్లీ ఫెల్లోస్ అనే సినిమా తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా కూడా నిరాశ‌ప‌ర‌చింది. ఒక్క హిట్‌తో మ‌ళ్లీ గాడిలో ప‌డాల‌ని అల్ల‌రి న‌రేష్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.  ఈ క్ర‌మంలో త‌న‌కి సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్ వంటి మంచి విజ‌యాల‌ని అందించిన జీ. నాగేశ్వ‌ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. 
Image result for seema sastri
త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉందట.  మరో కామెడీ ఎంట్రటైన్ మెంట్ గా ఈ సినిమా ఉండబోతుందట..ఈ సినిమా హిట్ అయితే మనోడు లైన్ లోకి వచ్చినట్టే అంటున్నారు.   ప్రస్తుతం ప్రముఖ దర్శకులు, నిర్మాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న ‘మహర్షి’సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: