కొంత  మంది ముఖాల్లో మాత్రమే రాచ కళ కనిపిస్తుంది. వారు వేస్తేనే ఆ పాత్రలకు అసలైన లుక్ వస్తుంది. గోల్డెన్ డేస్ లో మహారాణి అంటే మనకు క్రిష్ణ కుమారి గుర్తుకువచ్చేవారు. ఇపుడు జానపదాలూ లేవు, వేసే నాయకీమణులూ లేరు. అయితే అలాంటి పాత్రలు వస్తే మేము రెడీ అంటూ సత్తా చూపే వారు ఇప్పటికీ ఉన్నారు. అందులో నయన్  ముందు వరసలో ఉంటుంది. శ్రీరామరాజ్యంలో  రాములోరి సీతమ్మగా నటించాలన్నా, ఇపుడు ఓ పోరాటయోధుని సతీమణిగా రాచ కళతో ఉట్టిపడాలన్నా నయన్ కే  చెల్లింది.


ఈ రోజు నయన్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె తెలుగులో మెగా స్టార్ చిరంజీవి తో కలసి నటిస్తున్న ప్రెస్టేజ్ చిత్రం సైరా నరసిమ్హారెడ్డి. ఈ  మూవీలో నయన్ కి సంబంధించిన పాత్రతో టీజర్ ని మూవీ మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది నయన్ సైరా నరసిమ్హారెడ్డి భార్య సిధ్ధమ్మ పాత్రలో ఒదిగిపోయిందని ప్రశంసలు  కురుస్తున్నాయి. ఆనాటి ట్రెడిషన్ ని నయన్ తన ఫేస్ ద్వారా, ఆభరణాల ద్వారా లుక్ ద్వారా తీసుకువచ్చారని ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. 


మూవీకి నయన్ హీరోయిన్ కావడంతో సైరాకు అదనపు బలం వచ్చిందని ఇన్నాళ్ళూ అనుకున్న మాటలు ఇపుడు నిజం అయ్యాయి. సైరా మూవీని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక కోలీవుడ్లో నయన్ టాప్ హీరోయిన్. దాంతో ఆమె వల్ల అక్కడ మంచి హైప్ ఏర్పడే చాన్స్ ఉందంటున్నారు. టీజర్ ద్వారా నయన్ అదరగొట్టిందని యునానిమస్ గా అంతా అంటున్న మాట. రేపటి రోజున మూవీ ఎలా ఉంటుందో అన్న అంచనాలు ఈ టీజర్ తో పెంచేశారని చెబుతున్నారు. సో సిధ్ధమ్మ గా ప్రాణ ప్రతిష్ట చేసిన నయన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.


మరింత సమాచారం తెలుసుకోండి: