స్టార్ హీరోల సినిమాలు వస్తే..థియేటర్ల యాజమాన్యాలకు పండగు వాతావరణం ఉంటుంది.  వారం ముందు నుంచి వీళ్ల దందాలు మొదలు పెడుతుంటారు. ముఖ్యంగా బ్లాక్ టికెట్ దందాలతో ఎక్కువ రేట్లకు అమ్మడం..అదే సమయానికి టికెట్ రేట్లు పెంచడం ఇలా ఆడియన్స్ వీక్ నెస్ పై దెబ్బ కొడుతూ డబ్బు సంపాదించే పనిలో పడుతుంటారు.  ముఖ్యంగా తమిళ నాట ఈ వ్యవహారం కాస్త ఎక్కువే అని టాక్.  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలంగా ఏం మాట్లాడినా సంచలనంగా మారుతుంది.  ఆ మద్య రాజకీయాల్లోకి వస్తున్నానంటూ..ఇక్కడి రాజకీయాలు పూర్తిగా బ్రస్టుపట్టిపోయాయని సంచలన కామెంట్స్ చేయడం తెలిసిందే. 

తాజాగా ఆయన ఇండస్ట్రీ మాఫియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  తమిళ ఇండ‌స్ట్రీతో పాటు మ‌రిన్ని ఇండ‌స్ట్రీల‌ను కూడా ప‌ట్టి పీడిస్తున్న బ్లాక్ మార్కెట్ దందాపై వార్నింగ్ ఇచ్చాడు సూప‌ర్ స్టార్.  కొంత కాలంగా అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ బ్లాక్‌మార్కెట్ పంజా విప్పుతుంది.  ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే..ఈ దంగా విచ్చలవిడిగా సాగుతుందని..సామాన్య ప్రజలకు టిక్కెట్ కొని థియేటర్లో స్వేచ్చగా సినిమా చూసే ఛాన్స్ లేకుండా పోతుందని అందుకే పైరసీలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. 
Image result for robo 2.0
ర‌జినీకాంత్ ఫ్యాన్స్ క్ల‌బ్బుల‌కు వార్నింగ్ ఇచ్చాడు. త‌న ఫ్యాన్స్ ఎవ‌రూ బ్లాక్ మార్కెట్ ను ఎంక‌రేజ్ చేయొద్ద‌ని.. ఫ్యాన్స్ మెంబ‌ర్ షిప్ కార్డ్ ఉన్న వాళ్ల‌కు ఒరిజిన‌ల్ టికెట్ రేట్ ఇవ్వాల‌ని కోరాడు సూప‌ర్ స్టార్.  ఈ విషయాన్ని ర‌జినీకాంత్ ఆల్ ఇండియ‌న్ ఫ్యాన్స్ అసోషియేష‌న్ అధ్య‌క్షుడు విఎమ్ సుధాక‌ర్ కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసాడు.
Related image
ఈ సారి ఎవ‌రైనా బ్లాక్ దందా న‌డిపిస్తే ప‌రిస్థితులు దారుణంగా ఉంటాయంటున్నారు. అంతే కాదు ఈ విషయంపై ప్రభుత్వం కూడా సరైన దృష్టి సారించాలని..ఇలాంటి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.  మొత్తానికి "2.0" విడుద‌ల‌కు స‌రిగ్గా ప‌ది రోజుల ముందు కావాల‌నే బ్లాక్ దందాను రెచ్చ‌గొట్టేలా మాట‌ల తూటాలు విసిరాడు. మ‌రోవైపు త‌మిళరాక‌ర్స్ వాళ్లు కూడా "2.0"ను విడుద‌ల రోజే పైర‌సీ చేస్తాం అంటూ వార్నింగ్ విసిరారు. న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: