ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. రాజమౌళి చేస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఆర్.ఆర్.ఆర్ టైటిల్ తో వస్తున్న ఈ టైటిల్ లోని రహస్యం ఇంకా బయట పడలేదు.


ఇదిలాఉంటే రాజమౌళి ట్రిపుల్ ఆర్ కు బాహుబలి రూట్లోనే ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నడట. సినిమా ఈరోజు నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది. మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ పోస్టర్ కు సంబందించిన షూటింగ్ జరుపుతారట. ఈ నెల చివరనే ఆర్.ఆర్.ఆర్ సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తారట. ఫస్ట్ లుక్ టీజర్ లో చరణ్, ఎన్.టి.ఆర్ ల లుక్స్ రివీల్ చేస్తాడట.


సినిమా మీద అంచనాలను పెంచేందుకే రాజమౌళి ఈ మీగా ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. బాహుబలి తర్వాత ఆ సినిమా రికార్డులను కొట్టేంతటి సినిమాతో రావాలన్న రాజమౌళి అభిమానుల కోరిక మేరకు జక్కన్న ఈ ట్రిపుల్ ఆర్ ప్లాన్ చేశాడు. ఇక సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటిస్తున్నారు అన్న విషయం ఫైనల్ అవలేదు.


కీర్తి సురేష్, కియరా అద్వానిల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కరణ్ జోహార్ మాత్రం జాన్వి కపూర్ ను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ నెల చివరన వచ్చే పోస్టర్ ట్రిపుల్ ఆర్ కు మరింత క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: