విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ సినిమా ప్రస్తుతం  బాక్సాఫీసును షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజునే ప్రపంచ వ్యాప్తంగా  దాదాపు రూ.10.5 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసి చిన్న సినిమాల్లో సరికొత్త రికార్డును నమోదు  చేసిందీ సినిమా.  విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిషోతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.  పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో హిట్  మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.  ఈ మధ్యకాలంలో "నోటా" చిత్రంలో కూడా నటించారు. అయితే ఆ చిత్రం అనుకున్నంత విజయాన్ని సాధించి పెట్టలేదు. 

Related image

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను రూ.6 కోట్ల 32 కోట్ల షేర్ ని దాటేసింది. ఇదే స్పీడ్ మరో పది రోజులు కొనసాగితే మాత్రం మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ కి ఒక్కరోజు ముందు శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’సినిమా రిలీజ్ అయినా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  ఈ క్రమంలో రాహుల్ సాంక్రిత్యాన్ , విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన  ‘టాక్సీవాలా’ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన మళ్లీ ఫామ్‌లోకి వచ్చారని అంటున్నారు. 

Image result for taxiwala

ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ అనే సినిమాలో నటించేందుకు సైన్ చేశారు విజయ్. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది.  విజయ్ దేవరకొండ నటించిన  ‘టాక్సీవాలా’   జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు ఈ సినిమా నిర్మించారు. ప్రియాంక జవాల్కర్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మాళవికా నాయర్‌, కళ్యాణి, ఉత్తేజ్‌  మొదలైనవారు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఇలా ఉండగా.. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకొని రూ.9 కోట్ల 12 లక్షలు షేర్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. 


ఏరియా వైజ్ గా ‘టాక్సీవాలా’కలెక్షన్లు :

నైజాం :2 కోట్ల 76 లక్షలు

 సీడెడ్ :80 లక్షలు 

ఉత్తరాంధ్ర: 76 లక్షలు

గుంటూరు: 53 లక్షలు 

ఈస్ట్: 39 లక్షలు

 వెస్ట్: 35 లక్షలు 

నెల్లూరు:21 లక్షలు

 కృష్ణా:52 లక్షలు 

 ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.9 కోట్ల 12 లక్షలు


మరింత సమాచారం తెలుసుకోండి: