బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఒక దిక్కుమాలిన షో ను నడిపిస్తుంటాడు. డేటింగ్ గురించి సెక్స్   గురించి ప్రశ్నలు అడిగి షో ను నడిపిస్తుంటాడు. అయితే  గతవారం చూపించిన తన టాక్ షో టీజర్లో ఒక సెలబ్రిటీని ఆయన కూతురును పక్కనపెట్టి మరీ సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు అడిగిన కరణ్ జొహార్.. ఈవారం టీజర్లో మరో సెలబ్రిటీని అతడి చెల్లెలిని పక్కన కూర్చోబెట్టి సెక్స్ లైఫ్ ప్రస్తావన తీసుకొచ్చాడు.

ఈసారి చెల్లెల్ని పక్కన పెట్టుకుని సెక్స్ లైఫ్ పై!

తన తీరును కరణ్ ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఈసారి కరణ్ కు కాస్త  ఇంగితం లేకపోయినా సదరు సెలబ్రిటీకి మాత్రం కనిపించింది. చెల్లెలు పక్కన ఉంది.. ఇలాంటప్పుడు ఇవా అడిగేదని డైరెక్టుగా అనేశాడు. ఇలా మాట్లాడింది అర్జున్ కపూర్. వచ్చేవారం అర్జున్ కపూర్, జాన్వీకపూర్ లతో కాఫీ విత్ కరణ్ సాగనుంది. అందుకు సంబంధించిన టీజర్లో యథావిధిగా సెక్స్ లైఫ్ పై ప్రశ్నలు వినిపించాయి.

Image result for jhanvi and arjun kapoor in koffee with karan

అయితే వాటిపై స్పందించడానికి అర్జున్ నో చెప్పాడు. జాన్వీ పక్కన ఉండటమే అందుకు కారణం. ఇక జాన్వీని కూడా డేటింగ్ గురించి అడిగాడు కరణ్. ఆమె తొలిసినిమా హీరో ఇషాన్ తో డేటింగ్ చేస్తున్నావా అన్నాడు, దీనికి స్పందిస్తూ గట్టిగా నో చెప్పింది జాన్వీ. అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పింది. వీళ్ల విషయంలో గట్టిగా రూమర్లు వినిపించిన సంగతి తెలిసిందే. జాన్వీ మాత్రం అలాంటిదేమీ లేదంది.

మరింత సమాచారం తెలుసుకోండి: