టాలీవుడ్ లో అప్పటి వరకు ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న దర్శకులు పూరి జగన్నాధ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘టెంపర్’సినిమా తెరకెక్కించాడు.  ఈ సినిమా లో మొదటి సారిగా ఎన్టీఆర్ నెగిటీవ్ షేడ్స్ లో కనిపించాడు.  ఇంట్రవెల్ వరకు ఒకదశలో ఎన్టీఆర్ పై కోపం వచ్చే పాత్ర అది..కానీ ఇంట్రవెల్ తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది..హీరోయిజం ఓ రేంజ్ లో చూపించాడు.  ఈ సినిమాలో కోర్టు సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి.  ఈ పాత్రలో ఎన్టీఆర్ తన విశ్వరూపాన్ని చూపించాడు. కాజల్ చాలా గ్లామర్ గా కనిపించింది. 
Image result for tamil ayogya first look
సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్ని సమపాళ్లలో ఉండటంతో ‘టెంపర్’ ఘన విజయం సాధించింది. ఈ సినిమా కంటెంట్ లోని కొత్తదనం కారణంగా వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.   ఈ సినిమా బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ చేస్తున్నాడు.  తమిళ రీమేక్ లో విశాల్ హీరోగా చేస్తున్నాడు. 'అయోగ్య' టైటిల్ తో ఈ సినిమాను వెంకట్ మోహన్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఎలాంటి మార్పులు లేకుండా చూడమని హీరో విశాల్ చెప్పినట్లు సమాచారం.  ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ ను విడుదల చేశారు.
Related image
పోలీస్ జీప్ కి ఆనుకుని స్టైల్ గా నుంచున్న విశాల్ లుక్ ఆకట్టుకుంటోంది.  ఇక తమిళ నాట విశాల్ కి మస్ ఇమేజ్ చాలా ఉంది..అందువలన ఈ కథ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు.  తమిళ్ లో ఏ సినిమా తీసినా విశాల్ తెలుగు లో కూడా రిలీజ్ చేస్తుంటారు.  రీసెంట్ గా పందెం కోడి 2 తో అభిమానుల ముందుకు వచ్చాడు. డిటెక్టీవ్, అభిమన్యుడు,పందెంకోండి 2 వరుస విజయాలతో  ఈ సినిమాపై క్రేజ్ ను పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఆయన సరసన రాశి ఖన్నా కనిపించనున్న సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: