నాచురల్ స్టార్ నాని దేవదాస్ సినిమా తర్వాత అసలు మల్టీస్టారర్ సినిమా వద్దనేశాడని మొన్నామధ్య వార్తలొచ్చాయి. నాగార్జునతో కలిసి నాని చేసిన దేవదాస్ హడావిడే తప్ప కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది లేదు. అందుకే ఇక మల్టీస్టారర్ స్క్రిప్ట్ అని తనదగ్గరకు ఎవరు రావొద్దని నాని గట్టిగానే చెప్పాడట.


కాని ఇప్పుడు మరో మల్టీస్టారర్ కు రెడీ అవుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. అదేంటి మల్టీస్టారర్ వద్దన్న నానినే మళ్లీ ఎలా మల్టీస్టారర్ కు ఓకే చెప్పాడు అంటే అది ఇంద్రగంటి డైరక్షన్ లో కాబట్టి అందుకు ఓకే చెప్పి ఉంటాడని అంటున్నారు. అష్ట చమ్మ సినిమాతో నానిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. 


ఆ తర్వాత జెంటిల్మన్ అంటూ మరో సినిమా కూడా చేశాడు అది కూడా హిట్ కొట్టాడు. అందుకే ముచ్చటగా మూడవసారి నాని మోహనకృష్ణ కలిసి సినిమా చేస్తున్నారట. ఇక ఈ సినిమా ఓ మల్టీస్టారర్ మూవీ అని తెలుస్తుంది. ఇందులో మరో హీరోగా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. యువ హీరోలలో కొత్త కథలతో దూసుకెళ్తున్న నిఖిల్ ఈసారి నానితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.


ఈ సినిమా గురించి మిగతా విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా నిఖిల్ మాత్రం ముద్ర అంటూ రాబోతున్నాడు. చూస్తుంటే నిఖిల్, నాని క్రేజీ మల్టీస్టారర్ కు రెడీ అవబోతున్నారని చెప్పొచ్చు. మరి ఆ సినిమా కథ ఎలా ఉంటుంది దానికి సంబందించిన విషయాలు మాత్రం త్వరలో తెలుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: