బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లోకి ఎక్కుతుంటారు.  గతంలో కృష్ణ జింకను చంపిన కేసులో ఎన్నో వివాదాలు తలెత్తాయి.  ఆయన ఇంటి ముందు ఎంతో మంది అభిమానులు సల్లూభాయ్ ని కలిసేందుకు ఉత్సాహం చూపించడం..అతని అనుచరులు వారిని నిరోదించడంతో వివాదాలు తలెత్తుతుంటాయి.  అంతే కాదు ఆ మద్య సల్మాన్ ఖాన్ ని చంపుతామని బెదిరించడం..రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని షూటింగ్ నుంచి ఎంతో కట్టుదిట్టాల మద్య ఇంటికి పంపించారు. 
Salman Khan
ఇలా ప్రతి విషయంలోనూ సల్మాన్ ఖాన్ పై పలు వివాదాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఓ యువకుడు సల్మాన్ ఖాన్ ని చంపేస్తానని బెదిరించడం సంచలనం రేపింది.  వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన గులాబన్బీ ఉరఫ్ షేర్ అనే వ్యక్తి బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.  సల్మాన్ ఖాన్ కి  గులాబన్బీ వీరాభిమాని..ఆయన్ని గాడ్ ఫాదర్ గా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు బాలీవుడ్ లో చిన్న చాన్స్ ఇప్పించాల్సిందిగా సల్మాన్ ని కలిసి మాట్లాడలనుకున్నాడు. 
Image result for salman khan fans
ఇటీవల సల్మాన్ మేనేజర్ కు ఫోన్ చేసి... సల్లూభాయ్ నెంబర్ కావాలని అడిగాడు.  అపరిచితులకు నెంబర్ ఇవ్వడం కుదరదని మేనేజర్ తిరస్కరించాడు..ఆ తర్వాత సల్మాన్ తండ్రికి కూడా ఫోన్ చేసి, నంబరు కావాలని అడిగాడు. సల్మాన్ తండ్రి కూడా నెంబర్ ఇవ్వకపోవడంతో అతన్ని కూడా బెదిరించాడు. తాను చోటా షకీల్ వద్ద పని చేస్తుంటానని హెచ్చరించాడు.
Related image
అంతే కాదు సల్మాన్ ఖాన్ ని చంపేస్తానని బెదిరించాడు.  దాంతో సల్మాన్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, బెదిరింపులకు దిగిన వ్యక్తిని గులాబన్బీ ఉరఫ్ షేర్ గా గుర్తించిన పోలీసులు... అతన్ని అరెస్ట్ చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: