ఆ మద్య భారత దేశంలో పెను సంచలనాలు సృష్టించిన చిత్రం ‘రోబో’.  స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేష్ లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలన రికార్డులు సృష్టించింది.  ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ రోబో 2.ఒ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రావడానికి ఇంకెంతో సమయం లేదు. 
Image result for robo 2.0
ఎనిమిది రోజుల్లో ఆయన కొత్త చిత్రం '2.ఓ' థియేటర్లోకి రానుంది.  ఇక ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా నిడివి రెండున్నర గంటలు కూడా లేదట. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 2.28.52 సెకన్ల చిత్రమిది.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్,ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది.  ఆ మద్య తెలుగు లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసింది.  ఇప్పుడు బాహుబలి సీరీస్ రికార్డులపై కన్నెశారు 2.ఒ చిత్ర యూనిట్.  అందుకే ప్రపంచ వ్యాప్తంగా పదివేల థియేటర్లలో రిలీచేయబోతున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. 
Image result for robo 2.0
గతంలో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'జెంటిల్‌ మన్', 'భారతీయుడు', 'అపరిచితుడు', 'రోబో’లతో పోలిస్తే, '2.ఓ' నిడివి తక్కువ కావడం గమనార్హం. చిత్రంలో ఎక్కువ శాతం హై టెక్నాలజీ, గ్రాఫిక్స్ వాడటం వల్ల ఈ మార్పులు చేసి ఉంటారని ఫిలిమ్ వర్గాల టాక్.  ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు అక్షయ్‌ కుమార్, అమీజాక్సన్‌ తదితరులు నటించగా, శంకర్‌ దర్శకత్వంలో సుమారు రూ. 550 కోట్ల బడ్జెట్‌ తో ఇది తయారైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: