సినిమాకు 10 కోట్ల నుండి 15 కోట్ల వరకూ భారీ పారితోషికాలు తీసుకొనే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లకు కూడా రూపాయి కష్టాలు వస్తున్నాయి. అయితే ఈ కష్టాలు వారి సొంతానివి కావు. వారి సినిమాలు తీస్తున్న నిర్మతలవి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా’, మహేష్ బాబు తో ‘వన్’, వెంకటేష్- రామ్ లతో ‘మసాలా’ సినిమాలు తీస్తున్న నిర్మాతలకు రోజురోజుకీ పడిపోతున్న రూపాయి విలువ శాపంగా మారింది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫారిన్ షెడ్యుల్స్ జరుపుకుంటోన్న ఈ సినిమాల ఖర్చు డాలర్ తో రూపాయి విలువ పతనం తో సుమారు 40% అదనంగా ఖర్చు పెరిగిపోతోందని, దీనితో ఈ సినిమా నిర్మాతలు అయిన దిల్ రాజు, అనిల్ సుంకర, దగ్గుపాటి సురేష్ బాబు లకు ఇప్పటికే సినిమా చిత్రీకరణ దాదాపు చివరి వరకూ వచ్చిన ఈ సినిమాలు అత్యధికమైన భారాన్ని మోపుతున్నాయని అంటున్నారు. తెలుగు సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ అంచనా ప్రకారం విదేశాలలో తీసే ఒక భారీ సినిమా ఖర్చు రోజుకు 25 లక్షలు గతంలో ఉంటే, ఈరోజు అది రోజుకు 45 లక్షలకు ధాటి పోతోందని, దీనితో భవిష్యత్ లో మన టాప్ యంగ్ హీరోల సినిమాలను విదేశాలలో తీసే పరిస్థితి లేదని అంటున్నారు.

ఈ పరిస్థితుల నేపధ్యంలో విదేశాలలో షూటింగ్ జరుపుదాము అని గతంలో నిర్ణయి౦చుకున్న చాలామంది సినిమా నిర్మాతలు తమ సినిమాలను విదేశాలకు బదులు మన ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్, రాజమండ్రి లలోని ప్రకృతి రమణీయ ప్రాంతాలలో షూట్ చేసే విధంగా ప్లాన్ మార్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు ఇలా వస్తూ ఉంటే, ఓవర్ సిస్ మార్కెట్ లో మంచి కలెక్షన్స్ స్టామినా చూపెడుతున్న ప్రిన్స్, జూనియర్, రామ్ చరణ్ ల సినిమాలకు రూపాయి పతనం అయినా డాలర్ పెరిగిపోతోంది కాబట్టి ఓవర్ సిస్ కలెక్షన్స్ నిర్మాతలను ఆదుకుంటాయి అనే మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా రూపాయి పతనం భారతదేశ ఆర్ధిక మంత్రినే కాకుండా మన టాలీవుడ్ హీరోలను కూడా ఖంగారు పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: