ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న  అన్న నందమూరి తారక రామారావు గారి జీవితానికి సంబంధించిన సినిమా ఎంటీయార్ కధానాయకుదు, ఎంటీయార్ మహా నాయకుడు రెండు భాగాలకు సంబంధించిన ఆడియో వేడుకలకు ముహూర్తం రెడీ అయింది. డిసెంబర్ 16న అంగరంగ వైభవంగా ఆడియోను పలువురు ప్రముఖుల సమక్షంలో పవిత్ర తిరుపతి నగరంలో నిర్వహిస్తారని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం


అన్న గారికీ తిరుపతికి అవినాభావ సంబంధం ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి తొలి ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయనకు తిరుపతి వెంకన్న కుల దైవం.  ఇక బయోపిక్ చిత్ర కధానాయకుడు  బాలయ్యకు, దర్శకుడు క్రిష్ కి కూడా తిరుపతి ఓ మధురానుభూతి. వారిద్దరి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో కూడా తిరుపతిలోనే చేయడం, దానికి అతిరధ మహరధులు విచ్చేసి విజయవంతం చేయడం జరిగాయి. ఆ మూవీ కూడా గ్రాండ్ సక్సెస్  అయింది.


ఆ రెండు సెంటిమెంట్లను ద్రుష్టిలో నుంచుకుని అన్న గారి బయోపిక్ ఆడియోను కూడా తిరుపతిలో ప్లాన్ చేసినట్లుగా అర్ధమవుతోంది. ఈ వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులతో పాటు, సినీ దిగ్గజాలు, అతిరధ మహారధులెందరో హాజరవుతారని తెలుస్తోంది. ఇక ఎంటీయార్ కధానాయకుడిని జనవరి 9న, మహా నాయకుడిని జనవరి 26న విడుదల చేస్తారని పెర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి మంచి బిజినెస్ జరిగినట్లుగా, బాలయ్య కెరీర్ లోనే పెద్ద ఎత్తున మార్కెట్ జరిగినట్లుగా భోగట్టా.


మరింత సమాచారం తెలుసుకోండి: