దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించనున్నారు డైరెక్టర్ క్రిష్.

Image result for ntr

ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన రాజకీయాన్ని మరియు సినిమా రంగాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ సినిమాలపై అంచనాలు పెంచారు డైరెక్టర్ క్రిష్. ఈ క్రమంలో ఈ సినిమాలో అన్ని పాత్రలకు భారీ తారాగణాన్ని ఎంచుకున్న డైరెక్టర్ క్రిష్ ఒక పాత్రకు సరైన వ్యక్తులు దొరకకపోవడంతో..ఆ పాత్ర లేకుండానే సినిమా తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ క్రిష్.

Image result for suryakantham

ఇంతకీ ఆ పాత్ర మరెవరో కాదు గయ్యాళి సూర్యకాంతం అత్తది. ఈ పేరు వింటే గయ్యాళి అత్త పాత్రలు ఎన్నో మన కళ్ల ముందు మెదులుతాయి. అప్పట్లో అలాంటి పాత్రలకు ఆమెను ఢీకొట్టే నటీమణులు మరొకరు లేరు. నిజానికి చెప్పాలంటే ఇప్పటికీ ఆమెను మైమరిపించే గయ్యాళి అత్తలు ఏ ఇండస్ట్రీలలో లేరన్నది జగమెరిగిన సత్యం.

Related image

అందుకే కాబోలు ఆ పాత్ర కోసం క్రిష్ చాలా మందిని ఆలోచించాడట. అయితే ఆమె పాత్రలో ఎవ్వరూ అంత అద్భుతంగా నటించలేరని భావించిన క్రిష్.. సూర్యకాంతం పాత్ర లేకుండానే యన్‌టిఆర్‌ను తెరకెక్కిస్తున్నాడట. దీంతో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో బయటకు రావడంతో పెద్ద సంచలనంగా మారింది.




మరింత సమాచారం తెలుసుకోండి: