రాజమౌళి ఏదైనా సినిమా చేస్తున్నాడంటే ఇండియా మొత్తం ఇప్పడూ ఎదురు చూస్తుంది. అయితే తాజాగా రాజమౌళి తన కొత్త ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' మొదలు పెట్టాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. రాజమౌళి సినిమా ప్లానింగ్ ఇండస్ట్రీలో ఎవరి ఊహకు అందడం లేదు. ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టిస్తున్న రాజమౌళి ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు చూపించబోతున్నారో? అనే చర్చ మొదలైంది. తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

120 కెమెరాలతో షూటింగ్

ఇప్పటి వరకు ఇండియాలో అత్యంత హై టెక్నాలజీతో రూపొందిన మూవీ ఏది అంటే... శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 2.0. ఇందులో 3డి టెక్నీలజీతో పాటు 4డి సౌండ్ వాడారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్' మూవీ వీటిని మించిపోయేలా ఉండబోతోందట. ఈ సినిమాలో రాజమౌళి డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటాయట. ఈ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ఏకంగా 120 కెమెరాలను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

 4డి టెక్నాలజీతో చరణ్, తారక్ ఫేస్ కాప్చర్

యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హావభావాలు, ముఖకవళికలు 4డి టెక్నాలజీతో క్యాప్చర్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందట. సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో రాజమౌళి అండ్ టీం స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తోంది. తాము పెడుతున్న రూ. 300 కోట్ల ఖర్చుకు కనీసం రెట్టింపు....అంటే రూ. 600 కోట్ల వచ్చేలా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్లాన్ చేశారట. ఈ మేరకు పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: