యువ సంచలనం విజయ్ దేవరకొండ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న క్రేజ్ వచ్చేసింది. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక మధ్యలో నోటా ఫ్లాప్ అయినా మళ్లీ టాక్సీవాలాతో హిట్ అందుకున్నాడు.    


రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన టాక్సీవాలా మూవీ సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. రిలీజైన రెండో రోజే లాభాల బాట పట్టిన టాక్సీవాలాతో మరోసారి విజయ్ తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఈ సినిమా హిట్ మళ్లోసారి స్టార్ హీరోలకు షాక్ ఇచ్చేలా చేసింది. మూడు నాలుగు సినిమాలతోనే యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న దేవరకొండ విజయ్ సినిమాల మీద స్టార్ హీరోల కన్ను పడ్డది.


అతడు ఏ సినిమా చేస్తున్నాడు. ఎవరి డైరక్షన్ లో చేస్తున్నాడు. జానర్ ఏంటి.. కథ ఎలా ఉండబోతుంది అంటూ ఆరా తీస్తున్నారట. అతను చేస్తున్న కొత్త ప్రయత్నాలకు తెలుగు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే విజయ్ సినిమాల మీద స్టార్ హీరోల గురి పడ్డదట. టాక్సీవాలా హిట్ జోష్ లో ఉన్న దేవరకొండ విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. 


భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద కూడా యూత్ ఆడియెన్స్ లో ఆసక్తి పెరిగింది. గీతా గోవిందం తో హిట్ పెయిర్ అనిపించుకున్న విజయ్, రష్మికలు ఈ సినిమాలో జోడి కడుతుండటం విశేషం. టాలీవుడ్ లో ఫుల్ ఫాం లో ఉన్న రష్మిక విజయ్ సరసన మరో సూపర్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: