ఒకప్పుడు స్టార్ డైరక్టర్స్ లో ముందు మాట్లాడుకునే వ్యక్తుల్లో ప్రస్థావనకు వచ్చే కృష్ణవంశీ ఈమధ్య అసలేమాత్రం ఫాంలో లేడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాల ఫలితాలు చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్ధమవుతుంది. కెరియర్ లో ఎన్నో సంచలన విజయాలను అందుకున్న కృష్ణవంశీ క్రియేటివ్ డైరక్టర్ అన్న పేరుని ఆడియెన్స్ దగ్గర నుండే సంపాదించాడు.


తను తీస్తున్న సినిమాలు ఒకదాన్ని మించి మరోటి ఫ్లాప్ అవుతుంటే కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం కృష్ణవంశీ ఓ రీమేక్ పై దృష్టి పెట్టాడని తెలుస్తుంది. మరాఠిలో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడట కృష్ణవంశీ. తన కెరియర్ లో ఎప్పుడు సొంత కథలకే ప్రాధాన్యత ఇచ్చే కేవి కింగ్ నాగార్జునతో తీసిన చంద్రలేఖ మొదటి రీమేక్ సినిమా.


మళయాలంలో సూపర్ హిట్ అయిన చంద్రలేఖ సినిమాను మంచి ఫాం లో ఉన్నప్పుడు కృష్ణవంశీ రీమేక్ చేశారు. అయితే అక్కడ హిట్ అయిన ఆ సినిమా ఇక్కడ ఫ్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు తెలుగులో మరో రీమేక్ చేస్తున్నాడు కృష్ణ వంశీ. మహేష్ మంజ్రేకర్ డైరక్షన్ లో వచ్చిన నట సామ్రాట్ మూవీలో నానా పటేకర్ లీడ్ రోల్ చేశారు.


ఈ రీమేక్ లో నానా పటేకార్ స్థానంలో ప్రకాశ్ రాజ్ నటిస్తాడని తెలుస్తుంది. 2016 లో వచ్చిన నట సామ్రాట్ మూవీ అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. మరి రీమేక్ సినిమాగా బ్యాడ్ సెంటిమెంట్ కలిగిన కేవి నట సామ్రాట్ మూవీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమా హిట్టైతే సొంత కథలకు మంగళం పాడేసి ఇలా బయట సినిమాలు రీమేక్ చేయడం బెటర్ అని ఫిక్స్ అవుతాడు కావొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: