యువ హీరో లేటెస్ట్ సంచలనం విజయ్ దేవరకొండ సినిమా అంటే బాక్సాఫీస్ సందడి మొదలైనట్టే. పెళ్లిచూపులు నుండి టాక్సీవాలా వరకు దేవరకొండ విజయ్ కెరియర్ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా అతని కెరియర్ లో చేసిన 6 సినిమాల్లో నాలుగు సూపర్ హిట్లే. రీసెంట్ గా రిలీజైన టాక్సీవాలా కూడా రెండు రోజుల్లోనే లాభాలు తెచ్చి పెట్టింది.  


విజయ్ హిట్ సినిమా సీక్రెట్ ఏంటి అని ఆరా తీస్తే.. సింపుల్ గా ఒకటి మాత్రం అర్ధమవుతుంది. సినిమా సినిమాకు తన రేంజ్ పెరుగుతుంది కదా అని బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట వీజ్య్. సినిమా బడ్జెట్ లిమిటెడ్ గానే ఉండేలా చూసుకుంటూ కంటెంట్ విషయంలో రాజీ పడకుండా ఉంటున్నాడట.


అనుకున్న కథకు తక్కువ బడ్జెట్ లో పూర్తి చేస్తే యావరేజ్ టాక్ వచ్చినా కలక్షన్స్ వచ్చేస్తాయి. దానితో సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందని విజయ్ ఆలోచన. అనుకున్న విధంగానే అలానే అతని సినిమాలన్ని తక్కువ బడ్జెట్ తో వచ్చి సూపర్ హిట్ కలక్షన్స్ రాబడుతున్నాయి. స్టార్స్ మాత్రం తన లాస్ట్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో అంత బడ్జెట్ తో సినిమా తీసి నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కు చుక్కలు చూపెడుతున్నారు.


విజయ్ రేంజ్ ఇంకా అక్కడకు రాకున్నా సినిమాల బడ్జెట్, కంటెంట్ విషయంలో అతను తీసుకునే నిర్ణయాలే అతని విజయానికి కారణాలు అవుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. టాక్సీవాలా హిట్ తో మరోసారి తన సత్తా చాటిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: