విజయ్ దేవరకొండకు యూత్ లో ఫాలోయింగ్ వచ్చేలా చేసిన సినిమా అర్జున్ రెడ్డి. సందీ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా విజయ్ యాక్టింగ్ స్టామినా ఏంటో రుచి చూపించాడు. ఇక ఆ సినిమా తర్వాత గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలు హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. తెలుగులో హిట్టైన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హింది భాషల్లో రీమేక్ చేస్తున్నారు.


తమిళంలో వర్మగా వస్తున్న అర్జున్ రెడ్డి సినిమా హిందిలో కబీర్ సింగ్ టైటిల్ తో వస్తుంది. అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగానే హింది సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. సాహిద్ కపూర్, కియరా అద్వాని జంటగా నటిస్తున్న కబీర్ సింగ్ సినిమాలో తెలుగులో కన్నా ఎక్కువ బోల్డ్ సీన్స్ ఉండనున్నాయట.


తెలుగులో శృతిమించకూడదన్న కాన్సెప్ట్ తో సందీప్ వంగ కేవలం లిప్ లాక్స్ తో సరిపెట్టాడట. కాని షాహిద్, కియరాల మధ్య ఘాట్ రొమాన్స్ రాబోతున్న కబీర్ సింగ్ లో ఉంటాయట. కొన్నాళ్లుగా సరైన హిట్లు లేక సతమతమవుతున్న షాహిద్ కపూర్ కబీర్ సింగ్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న కియరా తన హాట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.


షాహిద్, కియరాల రొమాన్స్ ప్రత్యేకంగా ఉంటుందని కబీర్ సింగ్ చిత్రయూనిట్ చెబుతున్నారు. తెలుగులోనే లిప్ లాక్స్ రచ్చ చేయగా ఇక హిందిలో ఈ సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత సందీప్ వంగ మళ్లీ తెలుగులోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది. మహేష్ బాబుతో షుగర్ ఫ్యాక్టరీ సినిమా ఉంటుందని అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: