Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 4:39 am IST

Menu &Sections

Search

ఆ మూవీ చూసేంత వరకు భయపడ్డాను : రాహుల్ సంకృత్యన్

ఆ మూవీ చూసేంత వరకు భయపడ్డాను : రాహుల్ సంకృత్యన్
ఆ మూవీ చూసేంత వరకు భయపడ్డాను : రాహుల్ సంకృత్యన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం టాలీవుడ్ లో యువ దర్శకుల జోరు కొనసాగుతుంది.  పెళ్లి చూపులు సినిమాతో తరుణ్ భాస్కర్, అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ వంగా, ఆర్ ఎక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి తమ మొదటి సినిమాలతోనే సూపర్ హిట్స్ అందుకున్నారు.  తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ‘టాక్సీవాలా’మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. 
nayanthara-dora-movie-taxiwala-movie-rahul-sankrit
ఈ సినిమా సక్సెస్ ని టీమ్ అంతా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు  రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.  టాక్సీవాలా సినిమా గీతాగోవిందం, నోటా సినిమాల కన్నా ముందే ప్రారంభం అయ్యింది..అయితే ఈ సినిమా వచ్చే సమయానికి నయనతార నటించిన ‘డోరా’సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. 
nayanthara-dora-movie-taxiwala-movie-rahul-sankrit
అప్పటికే ఈ సినిమా 50 శాతం పూర్తి చేశారు..అయితే ‘డోరా’సినిమా 'కారులో ఆత్మ' అనే కాన్సెప్ట్  వస్తుందని తెలిసింది..అంతే కాదు పోస్టర్ చూసి మొదట భయపడ్డాను. దాంతో ఆ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే థియేటర్ కి వెళ్లి చూశాను..కాకపోతే మొదటి భాగంలో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ..ఇంట్రవెల్ తర్వాత  'డోరా' కథకి .. మా కథకి చాలా వ్యత్యాసం ఉందని క్లారిటీకి వచ్చారు.