టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు.  పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ లకు  టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కోట్లాది అభిమానులు ఉన్నారు..ఆయన రేంజ్ కి పవన్ కళ్యాన్ ఎదిగారు. ప్రస్తుతం పవన్ కళ్యాన్ జనసేన పార్టీ తరుపు నుంచి ప్రచారం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సంవత్సరం ‘రంగస్థలం’బ్లాక్ బస్టర్ తో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరాడు రాంచరణ్.  ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘విన‌య‌విదేయ రామ’సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. 
Image result for KALYAN DEV HERO
ఇక మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో షరవేగంగా సాగుతుంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి  సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు హీరోలుగా వచ్చి తమ సత్తా చాటుతున్నారు.  ఆ మద్య మెగాస్టార్ చిన్నల్లుడు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ 'విజేత' సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 
Image result for KALYAN DEV HERO VEJETHA
ఈ సినిమాల కమర్షియల్ గా హిట్ కాకపోయినా..కళ్యాన్ దేవ్ లుక్స్ పరంగా .. డాన్స్ పరంగా కల్యాణ్ దేవ్ కి మంచి మార్కులు కొట్టేశాడు.  ‘విజేత’ చిరంజీవి సూచన మేరకు మంచి కథ కోసం కొంతకాలం గ్యాప్ తీసుకున్న కల్యాణ్ దేవ్. ప్రస్తుతం కళ్యాన్ దేవ్ కి తగ్గ కథ దొరకడంతో రెండవ సినిమా కోసం రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు.
Image result for KALYAN DEV HERO VEJETHA
రిజ్వాన్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, పులి వాసు దర్శకత్వం వహించనున్నాడు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ రోజున ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.   అయితే ఈ సినిమాలో నటీ నటుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే టైటిల్ ను ఖరారు చేసుకుని, పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: