విశ్వనటుడు నటుడు కమల్‌ హాసన్‌, స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. లంచగొండి తనపై ఓ స్వతంత్ర సమరయోధుడు చేసిన యుద్దం ‘భారతీయుడు’. ఈ చిత్రం 16 ఏళ్ల క్రితం వచ్చింది..కానీ ఇప్పటి వరకు క్రేజ్ తగ్గలేదు.  ఈ చిత్రంలో ఏఆర్ రహమాన్ అద్భుతమైన పాటలు అందించారు.    తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రం మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కారణంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. 
Image result for భారతీయుడు 2
ఈ చిత్రంలో భారీ ఎత్తున స్టార్స్ ఉండబోతున్నారట.  ఇప్పటికే ఈ ప్రాజెక్టులో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, అందాతారలు కాజల్‌ అగర్వాల్‌, నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, తాజాగా కోలీవుడ్‌ వివాదాస్పద హీరో శింబు కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.  గతంలో  విజయ్‌తో శంకర్‌ తీసిన 'నన్బన్‌'లోనే శింబు నటించాల్సి ఉంది. అప్పుడు ఆ ఛాన్స్‌ మిస్సయినా 'ఇండియన్‌2'లో కమల్‌హాసన్‌ కలిసి నటించే అవకాశం రావడంతో శింబు వెంటనే అంగీకరించినట్టు తెలుస్తోంది. 
Image result for భారతీయుడు 2
ఈ చిత్రంలో తారాగణం ఎంపికలో వైవిధ్యాన్ని చూపుతున్న శంకర్‌.. టెక్నీషియన్ల విషయంలోను హైటెక్‌గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రజినీ నటించిన ‘2.ఒ’ తరహాలో గ్రాఫిక్స్‌తో పెద్దగా పనిలేకపోయినా ‘ఇండియన్‌2’ కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నారు.  వృద్ధుడి గెటప్‌లో కమల్‌ను మరింత వైవిధ్యంగా చూపించేందుకు హాలీవుడ్‌ టెక్నీషియన్ల సహాయం తీసుకుంటున్నారు.

ఇందుకోసం కమల్‌ శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారు. టెస్ట్‌ షూట్‌ కూడా ముగిసినట్లు సమాచారం.  లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'ఇండియన్‌2' షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. 2020లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: