టాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం మూడు సినిమాలతోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ.  పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘టాక్సీవాలా’తో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు.  ప్రస్తుతం యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజయ్ దేవకొండ తన అభిమానులను ముద్దుగా రౌడీస్ అని పిలుస్తుంటారు. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే ఆయ‌న పేరు ఓ ప‌రీక్ష ప‌త్రంలో ప్ర‌త్య‌క్షం కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది .   

ప్రస్తుతం "డియ‌ర్ కామ్రేడ్" సినిమాతో బిజీగా ఉన్నాడు విజ‌య్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో గురించి ఓ ప‌రీక్ష ప‌త్రంలో రావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఓ స్కూల్ ప‌రీక్ష ప‌త్రంలో 8వ ప్ర‌శ్న గ్రామ‌ర్ పేప‌ర్‌లో "అర్జున్ రెడ్డి" ప్ర‌శ్న ఉంది. Vijay Devarakonda has been________ since his blockbuster movie 'Arjun Reddy'.. అని ప్రశ్న ఇచ్చి కింద నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. ప‌రీక్ష పేప‌ర్‌లో విజ‌య్ పేరు చూసిన అభిమానుల ఆనందానికి హ‌ద్దులే లేకుండా పోయాయి.
Image result for vijay devarakonda
గ‌తంలోను ప‌లువురు స్టార్స్ పేర్లు ప‌రీక్ష పేప‌ర్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన, విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ వేరు కాబ‌ట్టి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.  గ‌తంలో విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవ‌రు అని ఓ ప్ర‌శ్నాప‌త్రంలో అడిగినందుకు వివాదం రేగింది. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ క్వ‌శ్చ‌న్ వ‌చ్చింది. మొత్తానికి విజ‌య్ ఇమేజ్ ఇప్పుడు స్కూల్స్ లో పరీక్ష పేపరు వ‌ర‌కు పాకింద‌న్న‌మాట‌. మ‌రి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో..? ఈ యూత్ ఫుల్ క్రేజీ హీరో. 


మరింత సమాచారం తెలుసుకోండి: