పిల్లలకు కార్టూన్ చిత్రాలంటే విపరీతమైన మోజు. ఇప్పటికీ కొన్ని కార్టూన్లు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎగబడి చూస్తుంటారు.  పాతికేళ్ల క్రితం విడుదలై విజయం సాధించిన 'ద లయన్ కింగ్' యానిమేషన్ ఫిల్మ్ చిత్రం ఇప్పుడు అద్భుతమైన టెక్నాలజీతో తయారై 3డీ యానిమేషన్లో అదే పేరుతో విడుదలకు సిద్ధం అవుతుండగా, దీని టీజర్ విడుదలై వైరల్ అవుతోంది. 1994లో వ‌చ్చిన యానిమేష‌న్ చిత్రం ద ల‌య‌న్ కింగ్‌కి ఉన్న‌త ప్ర‌మాణాలు జోడించి 3డీ యానిమేష‌న్‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.
The Lion King Official Teaser Trailer released
జోన్ ఫావ్రే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలోని పాత్ర‌లకు హాలీవుడ్ టాప్‌ స్టార్స్ డబ్బింగ్ అందించారు. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ డొనాల్డ్ గ్లోవర్, సేత్ రోజెన్, చివిటెల్ ఇజియోఫర్, బిల్లీ ఐచనర్, జాన్ ఓలివర్ తదితరులు వివిధ జంతు పాత్రలకు డబ్బింగ్ చెప్పడం గమనార్హం.   ఇందులో స‌న్నివేశాలు యానిమేష‌న్ ల‌వ‌ర్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 19, 2019న విడుద‌ల కానుంది. విడుద‌లైన కొద్ది స‌మ‌యంలోనే చిత్ర ట్రైలర్ 4 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టింది. ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.  ఈ చిత్రం వచ్చే సంవత్సరం వేసవి కానుకగా, జూలై 19న విడుదల కానుంది. చిన్నారులను విశేషంగా ఆకర్షించేలా తయారై వైరల్ అవుతున్న టీజర్ ను మీరూ చూడవచ్చు.

Image result for the lion king 2019 poster

 


మరింత సమాచారం తెలుసుకోండి: