విజయ్ దేవరకొండ ఒక విలక్షణమైన నటుడు. హీరో గానే కాకుండా ఆయన నటనలో ఎదో ప్రత్యేకత, విలక్షణత ఉంది. దానికి తోడు ఆయనకు ఎక్కడో అదృష్టం శనిలా పట్టేసింది. లేకుంటే ఇంత స్వల్ప సమయంలో "బ్లాక్బస్టర్ హీరో" గా వెలుగొందిన వాళ్ళు టాలీవుడ్ లో ఇంకొకరు లేరనటం అతిశయోక్తికాదు.  
Related image
ఉదాహరణకు విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ “టాక్సీవాలా” ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. టాక్సీవాలాకు చిత్రీకరణ సమయంలో, ఎన్నో ప్రతి కూల పరిస్థితులు ఎదురయ్యాయి. సినిమా గురించి వ్యతిరేక ప్రచారం జరిగింది. దెబ్బ మీద దెబ్బలా, పుండు మీద కారంలా పైరసీ కూడా మూడు నెలల క్రితమే విడుదలై పోవడంతో సినిమా దాదాపు చనిపోయిందని తాము భావించినట్లు స్వయంగా విజయ్ దేవరకొండే పలు వేదికలపై తెలిపాడు. 
Image result for taxiwala heroine
కానీ అనూహ్యంగా టాక్సీవాలా తొలి షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ టాక్సీవాలా షూటింగ్ సమయంలో తాను భయపడిన ఓ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కాపీ అంటూ రూమర్స్ స్వైరవిహారం చేశాయి అది కూడా టాక్సీవాలా చిత్రం విడుదల కాక ముందు విపరీత ప్రచారం జరిగింది. తమిళంలో నయనతార నటించిన 'డోరా చిత్ర కాన్సెప్ట్' తో టాక్సీవాలా చిత్రాన్ని రూపొందిస్తున్నారని వార్తలు వచ్చాయి. అప్పటికే పైరసీ లీక్ అయి ఆవేదన పడుతున్న యూనిట్ కు ఇది ఒక సమస్యగా మారింది. ఏదైనా సినిమా కాపీ అని వార్తలు వస్తే ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో మనకు తెలియంది కాదు.  
 కాపీ అంటూ రూమర్స్
టాక్సీవాలా చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యాక తమిళంలో నయనతార నటిస్తున్న డోరా చిత్రం కూడా దాదాపుగా ఇలాంటి  కారు కాన్సెప్ట్ తోనే రాబోతున్నట్లు తెలిసిందని రాహుల్ తెలిపాడు. డోరా చిత్ర పోస్టర్ చూసి చాలా భయపడిపోయానని స్వయంగానే రాహుల్ ప్రకటించారు కూడా. దీనితో టాక్సీవాలా చిత్ర షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడిందని తెలిపాడు. 
నయనతార భయపెట్టేసింది
"నా అనుమానం నివృత్తి చేసుకోవడానికి డోరా చిత్రం విడుదలయ్యాక తొలి షోనే చూశా. ఫస్టాఫ్ టాక్సీవాలతో చాలా దగ్గరగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఈ రెండు చిత్రాలకు ఎలాంటి పోలిక  లేకపోవటంతో చాలా సంతోషించాను" అని రాహుల్ తెలిపాడు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. 
Image result for taxiwala heroine
తాజా టాక్సీవాలా చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు చేస్తూ దూసుకుపోతోంది. పోటీగా మరో బలమైన చిత్రం లేకపోవడంతో టాక్సీవాలా కలెక్షన్ల సునామీయే సృష్టిస్తుంది. ఈ చిత్రం నిన్నటికే ₹25  కోట్లకు పైగా గ్రాస్ సాధించడం, శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం విద్దులయ్యే వరకు, అంటే ఈనెల 29 వరకు టాక్సీవాలా,  అద్భుత వసూళ్ల సునామీ కొనసాగనుంది. టాక్సీవాలా చిత్రంతో విజయ్ దేవరకొండ ఈ ఏడాది రెండో విజయం అందుకున్నాడు. అందుకే విజయ దేవరకొండ లో అద్భుత విలక్షణ నటనా సామర్ధ్యం మాత్రమే కాదు, ఏదో సుడి కూడా వైఫై లా చుట్టేసుకోని  తోడవుతుంది  నిర్వివాదాంశం. 

మరింత సమాచారం తెలుసుకోండి: