గతకొంత కాలంగా మౌనంగా ఉంటున్న రేణు దేశాయ్ చాల కాలం తరువాత తన మౌనం వీడింది. రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో పవన్ అభిమానుల ఆగ్రహానికి సెటైర్లకు గురైన నేపధ్యంలో రేణు పవన్ అభిమానుల మాటల దాడి నుంచి తప్పించుకోవడానికి ఆమె సోషల్ మీడియా వైపు చూడటం మానివేసింది. 
renu desai second marriage in the presence of akira and adhya
అయితే రేణు మళ్ళీ తన రూట్ మార్చుకుని ఈసారి ఏకంగా అకిరా నందన్ ఆద్యలకు సంబంధించిన ఒక లేటెస్ట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి పవన్ అభిమానుల మధ్య హాట్ న్యూస్ గా మారడమే కాకుండా పవన్ పిల్లలు ఇప్పటికీ తన వద్దనే ఉంటున్నారు అన్న క్లారిటీ ఇచ్చింది. ఒక బెంచ్ పై అకిరా ఆద్యలు పక్కపక్కనే కూర్చుని అకిరా చేతులోని సెల్ ఫోన్ లో ఎదో ఫిలింను చూస్తూ నవ్వుతు ఎంజాయ్ చేస్తున్న విషయానికి సంబంధించిన ఫోటో అది. 
ఫారెన్ టూర్
ఈ ఫోటోలో అకిరా టీనేజ్ కు వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఆకిరా చాల పొడవుగా కనిపిస్తూ తన తండ్రి పోలికలను గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో పవన్ అభిమానుల మధ్య వైరల్ గా మారడంతో వీరిద్దరూ తమ సెల్ ఫోన్ లో చూస్తున్న మూవీ ఏ హీరోది అంటూ ఏకంగా పవన్ అభిమానులు అకిరా ఆద్యలకు ప్రశ్నలు వేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. 
పవన్ పుత్రుడు...ఆరున్నర అడుగుల బుల్లెట్టు..!
ఇది ఇలా ఉండగా అమెరికాలో ఉన్న వ్యక్తిని పెళ్ళి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన రేణు దేశాయ్ డిసెంబర్ 4వ తారీఖున ఆమె వ్రాసిన కవితల పుస్తకాన్ని పూణేలో ఆవిష్కరించ బోతున్నట్లు తెలుస్తోంది. ఈ పుస్తకంలో రేణు దేశాయ్ తన గత జీవితానికి సంబంధించి జరిగిన సంఘటనలను పరోక్షంగా పేర్కొంటూ వ్రాసిన కవితలు కూడ ఉంటాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఏమైనా విరామం తరువాత రేణు దేశాయ్ మళ్ళీ మీడియాలో సందడి మొదలు పెట్టింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: