నాని నటించిన ‘నేను లోకల్’ మూవీ ఘన విజయంలో కీర్తి సురేష్ నానీల కాంబినేషన్ కూడ ప్రధానకారణం అన్న కామెంట్స్ ఉన్నాయి. ఈమూవీలో తన చలాకీ నటనతో కీర్తి యూత్ కు బాగా కనెక్ట్ అయింది. దీనికితోడు కీర్తి నానీల కాంబినేషన్ కూడ బాగా రక్తి కట్టడం మరో ప్రధాన కారణం అనే కామెంట్స్ కూడ అప్పట్లో వచ్చాయి.
నేను లోకల్‌లో జంటగా
ప్రస్తుతం వరస పరాజయాలను ఎదుర్కుంటున్న తన సినిమాల కథలకు సంబంధించి వైవిద్యంగా ఉండటమే కాకుండా తన సినిమాలకు సంబంధించిన హీరోయిన్స్ ఎంపిక విషయంలో కూడ చాల జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకుని అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో నానీకి కీర్తి సురేశ్ నుండి ఊహించని తిరస్కరణ ఎదురైనట్లుగా వార్తలు వస్తున్నాయి.
రిజెక్ట్ చేసిందంటూ
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి నానీతో త్వరలో మొదలు పెట్టబోతున్న ఒక థ్రిల్లర్ మూవీకి సంబంధించి హీరోయిన్ గా కీర్తి సురేశ్ ను ఎంపిక చేయమని వ్యక్తిగతంగా నాని కోరినట్లు టాక్. దీనితో దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి కీర్తిని సంప్రదిస్తే ఆమె కథ కూడ వినకుండా ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ అని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి హీరోయిన్ గా కీర్తి ఎంపిక ఇంచుమించు ఖరార్ కావడంతో ఆమె బల్క్ డేట్స్ అన్నీ రాజమౌళి సినిమాకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. 
కారణం ఇదేనా
ఇలాంటి పరిస్థుతులలో నానీతో మరొక సినిమాను ఒప్పుకుని రాజమౌళికి తన డేట్స్ విషయంలో సమస్యలు సృష్టించడం ఆమెకు ఇష్టం లేదు అని అంటున్నారు. కీర్తి విజయ్ తో చేసిన ‘సర్కార్’ ఘన విజయం సాధించడంతో ఇక తన తదుపరి సినిమాలు అన్నీ టాప్ హీరోలతోనే చేయాలి అన్న నిర్ణయం కూడ నానీని పక్కకు పెట్టె విషయంలో కీర్తి ఆలోచనలను ప్రభావితం చేసాయి అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ఏమైనా అనుకోకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ వల్ల నానీ ప్లాన్స్ కు అంతరాయం కలిగింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: