వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘మహర్షి' వచ్చే సంవత్సరం ఏప్రియల్ లో ఉగాది పండుగరోజున విడుదల కాబోతోంది. ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈమూవీ బడ్జెట్ ఈమూవీ నిర్మాతల మధ్య ఏర్పడిన ఇగో సమస్యలు వల్ల ఈమూవీ బడ్జెట్ అంచనాలను మించిపోయి ఆకాశాన్ని అంటుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. 

ముఖ్యంగా ఈమూవీకి వర్కింగ్‌ డేస్‌ ఎక్కువ ఉండడం విదేశాల్లో భారీ షెడ్యూల్స్‌ చేయడం వలన ఈమూవీ ఖర్చులు తారా స్థాయికి చేరినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్య మహేష్ కు తీవ్ర కలవరపాటు కలిగిస్తున్నట్లు టాక్. 

మహేష్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీ మార్కెట్ కు ఎటువంటి సమస్యలు లేకపోయినా మితిమీరి పెరిగిపోయిన ఈ ఖర్చులు వల్ల ఈమూవీని బయ్యర్లకు అధిక రేటుకు అమ్మితే ‘అరవింద సమేత’ కు వచ్చిన కష్టాలే తన ‘మహర్షి’ కి కూడ వస్తాయని మహేష్ టెన్షన్ అని అంటున్నారు. ‘అరవింద సమేత’ సూపర్ హిట్ టాక్ తేచుకున్నా ఆమూవీ అధిక రేట్లకు మార్కెట్ కావడంతో ఆమూవీ బయ్యర్లు చాలమందికి ఎంతోకొంత నష్టాలు వచ్చాయి. 

దీనితో అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోమని మహేష్ హెచ్చరిస్తున్నా పెరిగిపోతున్న ఈమూవీ బడ్జెట్ ఈమూవీకి శాపంగా మారుతుందా అని మహేష్ భయపడుతున్నట్లు టాక్. సినిమాకు హిట్ టాక్ వచ్చినా 100 కోట్లు మించి నెట్ కలక్షన్స్ రావడం కష్టమైపోతున్న రోజులలో సమ్మర్ రేస్ లో వరసపెట్టి సినిమాలు ఉన్న పరిస్థుతులలో ‘మహర్షి’ ని నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమిచేయాలి అంటూ పెరిగిపోతున్న ఈ ఖర్చులను చూసి మహేష్ ఖంగారు పడుతున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: