రాజకీయాలలో సినిమాలలో కులం ప్రాధాన్యత విపరీతంగా ఉంటుంది అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఈవిషయాలను ఓపెన్ గా ఒప్పుకోవడానికి అందరు ఇష్టపడరు. ఎలాంటి విషయాలు అయినా ఓపెన్ గా మాట్లాడే వర్మ తనకు ఉన్న కుల పిచ్చిని నిన్న జరిగిన ‘భైరవగీతం’ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో ఓపెన్ గా చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. 
RX 100 కాదు.. RDX 100
రజినీ కాంత్ ‘2.0’ మూవీతో పోటీగా వచ్చేవారం విడుదల అవుతున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఎటువంటి యాంకర్ సహాయం లేకుండా వర్మ తానే స్వయంగా నిర్వహించి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతేకాదు వేదికపైన తనదైన స్టయిల్లో సెటైర్లు కామెంట్లు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 
నాకు కులం ఫీలింగ్
ఈమూవీ దర్శకుడు సుధీర్ వర్మను వేదిక పైకి పిలుస్తూ తనకు కుల పిచ్చి ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. ఈమూవీలోని ఒక పాటను వర్మ శిష్యుడు ‘RX 100’ మూవీ డైరెక్టర్ అజయ్ భూపతితో రిలీజ్ చేయిస్తూ ‘RX 100’ కాదు ‘RDX 100’ అంటూ వర్మ అజయ్‌ పై జోక్ చేసాడు. 
వర్మ నాకు దేవుడి లాంటి వాడు
‘ఆర్ ఎక్స్ 100’ మూవీని తాను విడుదలకు ముందే చూసిన విషయాన్ని వివరిస్తూ ఈసినిమా హిట్ అయితే కాన్ఫిడెన్స్ హిట్ కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందని తాను అభిప్రాయపడ్డ విషయాలను వివరించాడు వర్మ. ఇదే ఫంక్షన్ లో వర్మ నిర్మాత రామసత్యనారాయణతో మరో పాటను రిలీజ్ చేయించినప్పుడు ఆ నిర్మాత మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలలో వర్మ తీసిన సినిమాల వల్ల తాను లాభ పడిన ఏకైక వ్యక్తిని అనడంతో వర్మ ఆనందంతో రామ సత్యనారాయణ కాళ్ళకు మొక్కదానికి ప్రయత్నించి అందరికి నవ్వులు తెప్పించాడు. ఒకవైపు ‘2.0’ మ్యానియా కొనసాగుతూ ఉంటే ఆసినిమాను లక్క చేయకుండా వర్మ చేస్తున్న సాహసం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: