ఒకప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మినుమమ్ గ్యారెంటీ హీరోగా ఎన్నో విజయాలు సాధించిన రవితేజ పరిస్థితి ఇప్పుడు ఎవరికీ అర్ధంకాని విషయంగా మారిందని కామెంట్స్ వస్తున్నాయి. వరస ఫ్లాప్ లు వచ్చినా రవితేజ తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు. 

దీనితో అవకాశాలు పూర్తిగా కనుమరుగైపోతున్న పరిస్థుతులలో రవితేజ తన పద్ధతి మార్చి ఈమధ్య తన పారితోషికంగా తన సినిమాలకు సంబంధించి తెలుగు హిందీ శాటిలైట్స్ హక్కులు ఇస్తే చాలు అన్న కండిషన్స్ పెట్టినట్లు సమాచారం. వాస్తవానికి రవితేజ లేటెస్ట్ మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ నెట్ కలెక్షన్స్ ను పరిగణలోకి తీసుకుంటే రవితేజాకు ఇచ్చిన పారితోషికానికి కూడ ఈమూవీకి వచ్చిన కలక్షన్స్ సరిపోలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు ఇతడి గత మూడు చిత్రాలు కూడా థియేటర్స్‌ నుంచి వచ్చిన కలక్షన్స్ కనీసం అతడి పారితోషికానికి కూడ సరిపోకపోవడంతో ప్రస్తుతం మాస్ మహారాజ పేరు చెపితే నిర్మాతలు బెంబేలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య విడుదలైన 'టచ్‌ చేసి చూడు', 'నేల టిక్కెట్టు' చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఫ్లాప్ లుగా మారిన నేపధ్యంలో ఈరెండు సినిమాల కలక్షన్స్ షేర్స్ కేవలం తొమ్మిది కోట్ల షేర్‌తో సరిపెట్టుకున్నట్లు టాక్.

దీనితో మాస్ మహారాజ తన పద్ధతి మార్చుకుని తన పారితోషికం పై పెడుతున్న ఏకాగ్రతకు బదులు తాను నటించే సినిమాల కథల పై పెట్టకుంటే ఇక ఈహీరో కెరియర్ అయిపోయినట్లే అని అంటున్నారు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఉన్న ఒకే ఒక్క మూవీ డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ కావడంతో ఈమూవీ సక్సస్ పైన మాత్రమే ఇంకా ఎంతకాలం రవితేజ ఇండస్ట్రీలో కొనసాగుతాడు అన్న విషయం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: