తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక టాలీవుడ్ కూడా హైదరాబాద్ నుండి వైజాగ్ కు షిఫ్ట్ అవుతుందని అన్నారు. అయితే అక్కడ స్టూడియో నిర్మాణాలు ఇంకా మొదలుపెట్టలేదు కాని ఇదవరకు కన్నా ఇప్పుడు ఎక్కువ సినిమాలు వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయని చెప్పొచ్చు. వైజాగ్ లో రామానాయుడు స్టూడియో ఉంది.


మొన్నీమధ్య నందమూరి బాలకృష్ణ వైజాగ్ లో స్టూడియో కట్టిస్తున్నాడని అన్నారు. అయితే దానికి సంబందించిన ముందడుగు మాత్రం పడలేదు. ఇక చెన్నై ఏ.వి.ఎం స్టూడియోస్ వారు కూడా భీమిలి, కాపులుప్పాడ దగ్గర స్టూడియో కోసం భూములు కేటాయించారని అన్నారు. కాని ఆ పనులు కూడా ఇంకా మొదలుపెట్టలేదు.


స్టూడియో కటాల్సి వస్తే దానికి సంబందించిన భూములను ఏపి ప్రభుత్వమే కేటాయించాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుండి వైజాగ్ కు తరలించేందుకు ముందు ఉత్సాహం చూపించినా ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టడం లేదట. స్టూడియోలు అక్కడకు వస్తే అక్కడ ప్రజలకు ఉపాది దొరుకుతుంది.


రామానాయుడు స్టూడియోకు ఆనుకుని ఓ టాలీవుడ్ నిర్మాతకు రెండు ఎకరాల భూమి ఉందట. దానికి మరో 3 ఎకరాలు కలిపి స్టూడియో నిర్మించాలని భావిస్తున్నాడట. అయితే ఏపి ప్రభుత్వం దానికి ముందుకు రావాలి. మరి చూస్తుంటే రాబోయే ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకుంటే తప్ప హైదరాబాద్ నుండి వైజాగ్ కు సిని స్టూడియోలు వచ్చేలా లేవు.



మరింత సమాచారం తెలుసుకోండి: