ఈవారం విడుదల కాబోతున్న ‘2.0’ ఫలితం గురించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాల ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సుమారు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడ్డ ఈమూవీ నిజంగా 1000 కలక్షన్స్ సాధించగలుగుతుందా అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం లీక్ అయింది. 
భారీ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్
'2.0' సినిమా కోసం రజినీకాంత్ చాల బరువైన బాడీ సూట్‌ వాడాల్సి వచ్చింది. అది రోబో 'చిట్టి' గెటప్‌ కోసం అని తెలుస్తోంది. అంత బరువైన ఆ సూట్‌ మోయడమంటే రజనీకాంత్‌ ప్రస్తుత వయసు రీత్యా చాల కష్టమైన పని దీనికితోడు ఈమూవీ చిత్రీకరణ సమయంలో సమయంలో రజనీకాంత్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడిన నేపధ్యంలో ఈ చిట్టి పాత్రకు సంబంధించిన సీన్స్ అన్నీ డూప్ తోనే చిత్రీకరించారని ప్రచారం జరుగుతోంది. 
 శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా
దీనికితోడు ఎవరు అడగకుండానే రజినీకాంత్ ఈమధ్య కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తాను ‘2.0’ షూటింగ్ సమయంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ చిట్టి పాత్రకు సంబంధించి బరువైన కోటును తానే వేసుకున్నాను అంటూ పట్టిపట్టి క్లారిటీ ఇవ్వడం ఈ డూప్ అనుమానాలకు మరింత ఆస్కారం కలిగిస్తోంది. వాస్తవానికి శంకర్ ‘2.0’ కోసం పలుగురు టాప్ హీరోల పేర్లను పరిశీలించి ఎవరూ తన స్క్రిప్ట్ ను నమ్మకపోవడంతో తిరిగి యూటర్న్ తీసుకుని రజినీకాంత్ వైపు వచ్చాడు అన్న వార్తలు కోలీవుడ్ మీడియా గత కొన్ని రోజులుగా రాస్తూనే ఉంది. 
ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో
ఇది ఇలా ఉంటే అత్యంత భారీ అంచనాలతో ఈవారం విడుదల కాబోతున్న ‘2.0’ విడుదల కాకుండానే 490కోట్ల ఆదాయం రాబట్టినట్లు తెలుస్తోంది. ‘2.0’కు ఒక్క తమిళంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 120 కోట్లు వచ్చినట్లు సినీ విశ్లేషకుడు రమేష్ బాలా చెపుతున్న అంచనాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్లు రాబట్టిన తొలి దక్షిణాది సినిమాగా ‘2.0’ క్రియేట్ చేస్తున్న రికార్డుల మ్యానియాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ షేక్ అవుతోంది..    

మరింత సమాచారం తెలుసుకోండి: