‘ట్యాక్సీవాలా’ ఊహించని రీతిలో  విజయాన్ని సొంతంచేసుకోవడంతో జోష్ లో ఉన్న విజయ్ దేవరకొండ చేస్తున్న కామెంట్స్ అతడి ఇగోను మరోసారి బయటపెట్టాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అత్యంత నెగిటివ్ అంచనాలతో విడుదలైన ‘టాక్సీవాలా’ ఒక మామూలు సినిమాగా నిలిచినా చాలని పెట్టుబడి  వెనక్కు వస్తే చాలని ఆమూవీ నిర్మాతలు భావించారు. 
 కాపీ అంటూ రూమర్స్
దీనికితోడు ఈసినిమా విడుదలకు మూడు నెలల ముందు మొత్తం సినిమా పైరసీ అవ్వడం ఈచిత్రం కథనుపోలి తమిళంలో ‘డోర’ అనే చిత్రం రావడంతో ‘టాక్సీవాలా’ కు కష్టాలు తప్పవు అన్న ప్రచారం జరిగింది. అయితే అందరి ఊహలను తల క్రిందలు చేస్తూ కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈసినిమా మొదటివారం పూర్తి అయ్యేసరికి 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడంతో మరొకసారి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ విజయ్ స్టామినాకు ఆశ్చర్యపోతోంది. 
 వసూళ్ల సునామి
ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమా ఘన విజయాన్ని యూత్ తో షేర్ చేసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో విజయ్ కొన్ని కాలేజీలకు వెళ్లి అక్కడ యూత్ ను కలుస్తూ చేస్తున్న కామెంట్స్ మరొకసారి విజయ్ దేవరకొండ మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈసమావేసాలలో విజయ్ విజయ్ దేవరకొండ కనిపించిన తీరు మాట్లాడిన తీరు మాటలు కాస్త విభిన్నంగా విచిత్రంగా కనిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు
ముఖ్యంగా తన సినిమాను పైరసీ చేసిన వ్యక్తులకు విజయ్ దేవరకొండ సారీ చెప్పాడు. అంతేకాదు ఆ పైరసీ చూసి విజయ్ దేవరకొండ పని అయిపోయింది అంటూ కామెంట్స్ చేసిన వారి ఊహలు నిజం కానందుకు తాను మరొకసారి సారీ చెపుతున్నాను అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తన పని అయిపోయింది అంటూ తాను షెడ్ కు వెళ్ళిపోవడం ఖాయం అంటూ తన పై విమర్శలు చేసిన వారికి ‘టాక్సీవాలా’ విజయం ఒక సమాధానం అంటూ ఇగో తో ఊగిపోతూ విజయ్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: