ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త అంబరీష్ శనివారం రాత్రి గుండెపోటుతో మరణించిన వార్త తెలిసిందే. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా బెంగళూరు విక్రం హాస్పిటల్ లో ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నారు. నిన్న సడెన్ గా ఇంట్లో కుప్పకూలిపోయిన ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. శనివారం రాత్రి  గుండెపోటు రావడంతో అంబరీష్ తుది శ్వాస విడిచారు.


అంబరీష్ మరణ వార్త విని సౌత్ సిని ప్రముఖులంగా షాక్ అయ్యారు. కన్నడ పరిశ్రమలో రెబల్ స్టార్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులను మెప్పించిన అంబరీష్ తిరిగి రాని లోకాలను వెళ్లిపోయారు. 1972లో ఆయన నాగరాహవు సినిమాతో తెరంగేట్రం చేశారు. అప్పటి నుండి దాదాపు 200 పైగా సినిమాల్లో నటించారు అంబరీష్.


ఈ ఇయర్ కూడా రాజ సింహా, అంబి నింగ రాజసేత్తో సినిమాల్లో నటించారు అంబరీష్. ఇక అంబరీష్ మృతి పట్ల తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. గొప్ప మనిషి.. నా బెస్ట్ ఫ్రెండ్.. ఈరోజు నేను కోల్పోయాను.. నేను నిన్ను మిస్ అవుతా.. నీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నా అంటూ రజిని ట్వీట్ చేశారు.


కన్నడ పరిశ్రమలో అంబరీష్ ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన నటుడు. సినిమాల్లోనే కాదు పొలిటిషియన్ గా కూడా ఆయన ప్రజలకు సేవలు చేశారు. పరిశ్రమ పెద్దగా బాగోగుల గురించి పరిశ్రమ అభివృద్ధి గురించి అంబరీష్ తోడ్పడేవారు. అంబరీష్ భార్య సుమలత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 


మరింత సమాచారం తెలుసుకోండి: