కన్నడ రెబల్ స్టార్ ప్రముఖ రాజకీయ నేత అంబరీష్ (66) శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి బెంగళూరు విక్రం హాస్పిటల్ లో హార్ట్ ఎటాక్ వల్ల మరణించారు. అంబరీష్ మరణ వార్త విని శాండల్ వుడ్ తో పాటుగా టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలు షాక్ అయ్యాయి.


1952 మే 29 హుచ్చే గౌడా, పద్మావతి దంపతులకు అంబరీష్ జన్మించారు. అంబరీష్ అసలు పేరు హుచ్చే గౌడా అమర్ నాథ్. సినిమాల్లో ఆయన్ను ముద్దుగా అంబీ అని పిలుస్తారు. 1972లో అంబరీష్ తొలి సినిమా నాగరాహవు సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి సినిమా నుండే అంబరీష్ సత్తా చాటారు.


1992లో అంబరీష్ అప్పుడు హీరోయిన్ గా మంచి ఫాంలో ఉన్న సుమలతను పెళ్లాడారు. కన్నడలో ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. అందుకే ఆయన్ను కన్నడ రెబల్ స్టార్ అంటారు. కెరియర్ లో 200 పైగా సినిమాలు చేసిన అంబరీష్ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. 2009లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ తో పాటుగా 2012లో సైమా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అందుకున్నారు. 


పొలిటికల్ గా కూడా అంబరీష్ తన ప్రస్థానం కొనసాగించారు. కాంగ్రెస్ నేతగా ప్రజలకు సేవ చేశారు అంబరీష్. అంబరీష్ మరణ వార్త విని టాలీవుడ్ సిని ప్రముఖులు ఆయన మృతికి నివాళి అర్పించారు. అంబరీష్ కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి ప్రకటించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: