ఎన్టీఆర్ బయోపిక్ తో నందమూరి సింహం బాలకృష్ణ నేటి క్రేజీ యంగ్ హీరోయిన్స్ తో నటించాలి అన్న తన కోరికను పూర్తిగా తీర్చేసుకుంటున్నాడు. శ్రీదేవి 20 ఏళ్ల వయస్సులో నందమూరి తారకరామారావుతో రొమాన్స్ చేస్తే ఇప్పుడు బాలకృష్ణ ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ సంచలనం పాయల్ రాజ్ పుట్ తో రొమాన్స్ చేయడం సంచలనంగా మారింది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన కథానాయకుడు పార్ట్ లో పాయల్ రాజ్ పుట్ జయసుధ పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. జయసుధ రామారావులు కలిసి నటించిన ఒక సినిమాలోని మాస్ మసాలా సాంగ్ ను బాలయ్య పాయల్ రాజ్ పుట్ లపై చిత్రీకరించబోతున్నట్లు టాక్.

ఇప్పటికే ఈ బయోపిక్ లో శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ నటిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు పాయల్ కూడ రంగంలోకి దిగడంతో ఈసినిమాకు సంబంధించి అన్ని మసాల హంగులను క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కు అద్దినట్లు అయింది. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు అత్యంత భారీ కలక్షన్స్ రాబట్టాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ ప్రమోషన్ చార్ట్ ను బాలకృష్ణ రూపొందించినట్లు సమాచారం. 


డిసెంబరు 2న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ టీజర్ రిలీజ్ చేస్తారట. డిసెంబరు 16న ఈ చిత్ర ఆడియో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఆతరువాత డిసెంబర్ నెలాఖరులో ఈమూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం. దీనితో జనవరి 9న విడుదల కాబోతున్న ఈమూవీకి సంబంధించిన అన్ని ప్రమోషన్ కార్యక్రమాలు అత్యంత ప్లాన్డ్ గా చేసి ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ వచ్చేలా బాలయ్య వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: