సౌత్ ఇండియన్ టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరైన శంకర్ తన ప్రతి సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంటారు. ఆయన కెరియర్ జెంటిల్ మన్ సినిమా నుండి మొదలవగా దర్శకుడిగా తన ప్రతి సినిమాతో మరింత క్రేజ్, పాపులారిటీ సంపాదించారు శంకర్. ప్రస్తుతం రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శంకర్ తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ప్రస్థావించారు.


2.ఓ రిలీజ్ కు ముందే ఇండియన్ సినిమాకు సీక్వల్ మొదలు పెట్టిన శంకర్ ఇండియన్-2ని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ తో పాటుగా దుల్కర్ సల్మాన్ కూడా ఇండియన్-2లో ఉంటున్నాడని తెలుస్తుంది. ఇక శంకర్ ఆలోచనల్లో ముదల్వన్ సినిమాకు సీక్వల్ ఆలోచన ఉందట. 


ఓ సామాన్య జర్నలిస్ట్ సిఎం ను ఇంటర్వ్యూ చేసి ఒక్కరోజు సిఎంగా అధికారం తీసుకుని దేశంలోని అవినీతిని ఎలా రూపుమాపాడు అన్నది సినిమా కథ. శంకర్ డైరక్షన్ లో అర్జున్ హీరోగా వచ్చిన ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వల్ పై తన ఇంట్రెస్ట్ బయట పెట్టారు శంకర్.


ఈ సీక్వల్ ను శంకర్ ఎవరితో చేయదలచుకున్నాడు అంటే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో ముదల్వన్ సీక్వల్ చేస్తాడని అంటున్నాడు. ఈమధ్య వరుస విజయాలతో ఫుల్ ఫాం లో ఉన్న విజయ్ శంకర్ తో కలిసి ఆ సీక్వల్ చేస్తే ఇక ఆ సినిమాకు తిరుగు ఉండదని చెప్పొచ్చు. శంకర్ డైరక్షన్ లో విజయ్ నన్ బన్ సినిమా చేశాడు. ఆ సినిమా 3 ఇడియట్స్ కు రీమేక్ గా వచ్చింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: