ప్రముఖ కన్నడ నటుడు శాండిల్‌ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ మరణం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షాక్ లో ముంచెత్తి వేసింది. సినిమా రంగంలోని చాలామంది  అంబి అంటూ అత్యంత ప్రేమగా పిలుచుకునే అంబరీష్ ఇకలేరు అన్న విషయాన్ని ఇప్పటికి ఫిలిం ఇండస్ట్రీ నమ్మలేక పోతోంది.   
కంటతడి పెట్టిన రజనీకాంత్
అంబరీష్ మరణ విషయం తెలియగానే సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో పాటు సౌత్ సినీ ప్రముఖులు బెంగుళూరు చేరుకున్నారు. తమ ఆప్తమిత్రుడు మరణించిన విషయాన్ని రజనీకాంత్ చిరంజీవి జీర్ణించుకోలేక అంబరీష్ మృతదేహం చూసిన వెంటనే భావోద్వేగాలను ఆపుకోలేక చిరంజీవి రజనీకాంత్లు కంట కన్నీరు పెట్టుకున్నారు.   
కావేరి జలాల విషయంలో
కేవలం  కన్నడిగులకు మాత్రమే కాకుండా అంబరీష్ కు ఇతర భాష సినిమారంగ ప్రముఖులతో పరిచియాలు ఉండటంతో ఎందరో సినిమా రంగప్రముఖులు అంబరీష్ ను కడసారి చూడడానికి వచ్చారు. ‘అంబరీస్ గొప్ప మనసున్న వ్యక్తి, నా స్నేహితుడు నాకు దూరమయ్యాడు. ఇక ముందు నీవు లేవన్న విషయంతో దు:ఖంలో మునిగిపోయాను’ అంటూ రజినీకాంత్  ట్వీట్ చేశాడు. అంబరీష్ మరణ వార్త తెలియగానే ‘సైరా’ షూటింగ్ కేన్సిల్ చేసుకుని మెగాస్టార్ చిరంజీవి బెంగుళూరు చేరుకున్న చిరంజీవి తనకు అత్యంత సన్నిహితుడైన అంబరీష్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేక విపరీతమైన భావోద్వేగానికి గురి అయ్యాడు. 
విష్ణువర్ధన్‌ అత్యంత స్నేహితుడు.
కన్నడ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న అంబరీష్ లేని లోటు తీర్చలేనిదని పరిశ్రమలో ఏసమస్య వచ్చినా ఆయన ముందుండి పరిష్కరించే వారని అంటూ అందరు అంబరీష్ ను గుర్తు చేసుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్యం అధికారిక లాంఛనాలతో అంబరీష్ అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం  అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో అంబరీష్  భౌతికకాయాన్ని ఉంచడంతో వేలాదిగా అభిమానులు అంబరీష్ ను కడసారి చూడడానికి వస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: