విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. ఆ సినిమా విజయం విజయ్ దేవరకొండకు సూపర్ క్రేజ్ తెచ్చేసింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ యువ హీరో ఏకంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీతా గోవిందం, టాక్సివాలా హిట్ మేనియా కొనసాగిస్తున్నాడు. 


అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో సూపర్ హిట్ అవడంతో తమిళ, హింది భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా వర్మ సినిమా వస్తుంది. ఇక షాహిద్ కపూర్ బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కుతుంది. అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ కబీర్ సింగ్ ను డైరెక్ట్ చేస్తుండటం విశేషం.


షాహిద్ కపూర్ కు జోడీగా కియరా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ నుండి ఎలాంటి పిక్స్ లీక్ అవకుండా కబీర్ సింగ్ యూనిట్ జాగ్రత్త పడుతుంది. అయితే సినిమా నుండి షాహిద్ కపూర్ గడ్డం లుక్ తో పాటుగా క్లీన్ షేవ్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. అది చూస్తే దాదాపుగా అర్జున్ రెడ్డి సినిమాను మక్కీకి మక్కీ దించుతున్నారని తెలుస్తుంది.


బాలీవుడ్ అర్జున్ రెడ్డి అదేనండి కబీర్ సింగ్ సినిమాలో మాత్రం రొమాన్స్ ఇంకా ఘాటుగా ఉంటుందట. భరత్ అనే నేను సినిమాతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న కియరా అద్వాని షాహిద్ తో రొమాన్స్ అదరగొడుతుందని అంటున్నారు. మరి తెలుగులో ఈ సినిమా వచ్చిన ఫలితాన్ని అక్కడ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: