‘ప్రజాపోరాట’ యాత్ర చేస్తూ జనం మధ్య తిరుగుతూ తన ‘జనసేన’ ను ప్రజలలోకి తీసుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ కు తూర్పు గోదావరి జిల్లాలోని గిరిజనులు పూనకం తెప్పించారు. పవన్ కళ్యాణ్‌కు డప్పుల మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ నటించిన ప్రతి సినిమాలోను జానపద బాణీలో ఉండే ఎదో ఒక పాటను ఉండేలా చేసుకుని పవన్ తనకు గల ఫోక్ మ్యూజిక్ ఇష్టాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. 
సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా?
ముఖ్యంగా తన సినిమాలోని పాటలలో ఫోక్ బీట్స్ ఏరికోరి పెట్టించుకునే వాడు. ఆ శబ్దం వింటే పవన్ కళ్యాణ్‌కు పూనకం వస్తుందని, ఎంతో తన్మయత్వం పొందుతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అది నిజమే అని అనిపించే ఒక ఆసక్తికర సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. 
పవన్ కళ్యాణ్ మీద పుకార్లు
పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే సందర్భంలో సుద్ధగొమ్ము గిరిజిన ప్రాంతంలో పవన్ కు గిరిజనులు సంప్రదాయ డప్పు వాయిద్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక అంతే ఈస్వాగతం చూసిన వెంటనే పవన్ లోని నటుడు వెంటనే మోల్కొని ఆ డప్పుల వాయిద్యానికి అనుగుణంగా స్టెప్స్ వేయడంతో జనసేన కేడర్ అంతా ఆనందంతో మైమరిచిపోయింది. 

అంతేకాదు ఎన్నికలలోపు పవన్ ఒక సినిమాలో నటిస్తాడు అంటూ వచ్చిన వార్తలను స్వయంగా పవన్ ఖండించినా ఆ వార్తలు నిజం అయితే బాగుండును అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ ఉభయగోదావరి జిల్లాల పై పట్టు సాధించడానికి చేస్తున్న వరస పర్యటనలతోరాబోతున్న ఎన్నికలలో పవన్ ఈ ఉభయ గోదావరి జిల్లాలలోని ఎదో ఒక ప్రాంతం నుండి పోటీ చేయడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: