‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పరాజయం చెందినా ఆసినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇలియానాకు ఊహించని అదృష్టం తలుపు తట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తీస్తున్న ‘వినయ విదేయ రామ’ మూవీలో చరణ్ తో ఒక ఐటమ్ సాంగ్ లో మాస్ స్టెప్స్ వేయగల హీరోయిన్ కోసం చేస్తున్న అన్వేషణలో అనుకోకుండా ఇలియానా ఆలోచన బోయపాటికి వచ్చినట్లు సమాచారం.
Ileana D'Cruz to return to Telugu films with upcoming Ravi Teja-starrer Amar Akbar Anthony
ఇప్పటికే కాజల్ తమన్నా పూజ హెగ్డే లాంటి చాల మంది టాప్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేసిన నేపధ్యంలో వారిలో ఎవరూ కాకుండా వెరైటీగా ఉంటుందని బోయపాటికి ఇలియానా ఆలోచన వచ్చినట్లు టాక్. ఈ సూచన చరణ్ కు కూడ నచ్చడంతో బోయపాటి ఇలియానాను సంప్రదిస్తే ఆమె చెప్పిన కండిషన్స్ కు బోయపాటి చరణ్ ల మైండ్ బ్లాంక్ అయినట్లు సమాచారం. 
Ileana D'Cruz's Holiday Pic Is Making Boyfriend Andrew Kneebone 'Kind Of Jealous'
తాను చరణ్ తో ఐటమ్ సాంగ్ లో నటించాలి అంటే తనకు 60 లక్షల పారితోషికం కావాలి అని అది కూడ తన ఐటమ్ సాంగ్ ను నాలుగు రోజులలో షూటింగ్ పూర్తి చేయాలని అంతకన్నా ఎక్కువ రోజులు షూటింగ్ పడితే తనకు అదనపు పారితోషికం ఇవ్వాలని ఇలియానా బోయపాటి ముందు డిమాండ్స్ పెట్టినట్లు టాక్. దీనితో ఇన్ని షరతులతో ఇలియానాను తెచ్చుకునే కన్నా వేరే హీరోయిన్ బాగుంటుంది కదా అన్న ఆలోచనలలో ప్రస్తుతం  బోయపాటి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 
Ileana joins the sets of Ravi Teja's Amar Akbar Anthony
వాస్తవానికి ‘వినయ విదేయ రామ’ షూటింగ్ అంతా పూర్తి అయినా ఇంకా ఒక ఐటమ్ సాంగ్ పెండింగ్ లో ఉండటంతో ఇలియానాతో అయితే డేట్స్ సమస్య లేకుండా వెంటనే ఆమె డేట్స్ దొరుకుతాయని బోయపాటి ఆలోచన అని అంటున్నారు. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడ తనకు వస్తున్న ఆఫర్లను లెక్క చేయకుండా ఇలియానా పెడుతున్న కండిషన్స్ విన్న వారు. ఇప్పటికీ ఇలియానాకు టాలీవుడ్ హీరోల పై కోపం తగ్గలేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: