త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ల ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయం చెందినా వారి ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. దీనికితోడు త్రివిక్రమ్ ఎన్నోసార్లు ఖండన ఇచ్చినా పవన్ ప్రస్తుతం చేస్తున్న ఉద్వేగపూరిత ఉపన్యాసాల వెనుక త్రివిక్రమ్ రచనా సహకారం ఉంది అన్న వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.

ఇటువంటి వరిస్తుతులలో ప్రస్తుతం సినిమాలను వదిలి రాజకీయాల బాట పట్టిన పవన్ త్రివిక్రమ్ కు ఈమధ్య చాల ఎక్కువ సార్లు గుర్తుకు వస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం త్రివిక్రమ్ కు టాప్ హీరోల నుండి ఎదురౌతున్న ప్రశ్నలు అని టాక్. వాస్తవానికి త్రివిక్రమ్ తాను చేసే సినిమాల విషయంలో ఎప్పుడు నిర్మాతల పై తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. 

తాను తీసే సినిమాల బడ్జెట్ విషయంలో త్రివిక్రమ్ నిర్ణయమే ఫైనల్ అని అంటారు. నిర్మాత సినిమా బడ్జెట్ ను కంట్రోల్ లో ఉంచుకోమని చెప్పినా త్రివిక్రమ్ పట్టించుకోడని చాలామంది అభిప్రాయ పడుతూ ఉంటారు. ‘అరవింద సమేత’ చిత్రీకరణ సమయంలో కూడ త్రివిక్రమ్ తాను కోరుకున్నట్లుగా ఆసినిమాను తీయలేకపోయాడని తరుచు జూనియర్ ఆసినిమా విషయంలో చేసిన సూచనలకు త్రివిక్రమ్ తలవంచ వలసిన పరిస్థుతులు వచ్చాయని అన్న వార్తలు ఉన్నాయి. 

‘అరవింద సమేత’ తరువాత ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయబోతున్న మూవీ కథ చర్చలలో అనేక సార్లు త్రివిక్రమ్ బన్నీ కోసం రాజీపదవలసి వస్తోందని వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈపరిస్తుతులలో త్రివిక్రమ్ తాను పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు చేసినా తనకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని కథ విషయంలో జూనియర్ బన్నీలు తనకు సూచించినంత ఎక్కువగా ఎప్పుడు తనకు పవన్ ఎలాంటి సూచనలు ఇవ్వలేదని అంటూ త్రివిక్రమ్ తన ప్రియ మిత్రుడు పవన్ ను తలుచుకుంటూ తన సన్నిహితుల మధ్య ఈమధ్య కామెంట్ చేసినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: