మూడు రోజులలో విడుదల కాబోతున్న రజినీకాంత్ 2.0’ మూవీ మ్యానియాతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ షేక్ అవుతోంది. విడుదలకు ముందే ఈమూవీకి కేవలం టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 120 కోట్లు వసూలు కావడం సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్ గా చెపుతున్నారు. ఈమూవీ విడుదల అవుతున్న మొదటి రోజున దేశ వ్యాప్తంగా 31వేల షోలు ప్రదర్శింప బడుతూ ఉండటం ఈమూవీ మ్యానియాకు నిదర్శనంగా మారింది. 
ఉదయం 4 గంటల నుంచే షోలు
సుమారు మూడు వేల మంది సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈమూవీ గ్రాఫిక్స్ వర్క్స్ కోసమే 400 కోట్లు ఖర్చుపెట్టడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్ గా మారింది. కేవలం మన ఇండియాలోని 6800 వందల  ధియేటర్లలో విడుదల కాబోతున్న ఈమూవీ ప్రధాన లక్ష్యం ‘బాహుబలి 2’ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం. అయితే ఇంత హడావిడి చేస్తున్న ఈమూవీ గురించి బాలీవుడ్ ప్రేక్షకులు ‘బాహుబలి’ పట్ల చూపించినంత ఆసక్తి కనపరచడం లేదు అని వార్తలు వస్తున్నాయి. 
విదేశాల్లోనూ భారీ రిలీజ్
ముఖ్యంగా ఈమూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతాలలో కనిపిస్తున్న హడావిడి ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన నగరాలకు సంబంధించిన  ధియేటర్లలో కనిపించడం లేదు అని ప్రాధమిక వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన నగరాలలో ‘2.0’ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ ‘బాహుబలి 2’ రేంజ్ లో టిక్కెట్లు వెళ్ళడం లేదు అని వస్తున్న వార్తలు దర్శకుడు శంకర్ కు కలవర పాటుకు గురిచేస్తున్నట్లు టాక్. 
 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్
దీనికితోడు ఇప్పటికే బాలీవుడ్ మీడియా ‘2.0’ గురించి విశ్లేషిస్తూ ఈమూవీ కేవలం చిన్న పిల్లలకు మాత్రమే నచ్చే సినిమా అంటూ విడుదల కాకుండానే చేస్తున్న నెగిటివ్ ప్రచారం శంకర్ కు తీవ్ర టెన్షన్ కు గురి చేస్తున్నట్లు సమాచారం. అయితే వాస్తవానికి ఈసినిమాలో ప్రతినాయకుడు పాత్రను అక్షయ కుమార్ పోషించినా బాలీవుడ్ మీడియా ఈమూవీని పెద్దగా పట్టించుకాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ‘2.0’ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయడం కష్టం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: