ఆమె కులుకులు వెండి తెర జిలుగులు. ఆమె అందం సినీ సీమకు సోబగులు  అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్టాటస్ సంపాదించిన ఆ ముద్దు గుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్స్ మూవీ ద్వారా టాలీవుడ్లో ఎంటీ ఇచ్చిన ఈ పంజాబీ భామకు ఇపుడు సినిమాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఆమె ఇపుడు కనిపించేది ఒకే ఒక చిత్రంలో అది అన్నగారి బయోపిక్ లో.



చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఇన్స్ట్రాగ్రం లో పోస్టింగులు పెడుతూ కుర్ర కారుని ధిమాక్ చేస్తున్న రకుల్ ఫిల్మ్ మేకర్లను మాత్రం కదిలించలేకపోతోంది. ఆమెతో సినిమాలు చేసిన హీరోలంతా ఇపుడు ఫ్రెష్ లుక్ కావాలంటున్నారు. ఇక రకుల్ ఈ మధ్య చేసిన మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఆమెతో జత కట్టెందుకు ఎవరూ రెడీగా లేరు. అలాగని  రకుల్  ఒక్కసారిగా డీ గ్రేడ్ అయి కుర్ర హీరోలతో  మూవీస్ చేయాలనుకోవడం లేదట. ఇంకా తన సత్తాను చాటగలననే నమ్మకంతో ఉందట.


ఇదిలా ఉండగా మరో హాట్ న్యూస్ ఇపుడు వైరల్ అవుతోంద్. రకుల్ ప్రీత్ సింగ్ మనసు పెళ్ళి మీదకు పోయిందని, ఆమె తొందరలోనే మూడు ముళ్ళూ వేయించుకుంటుందని ఆ న్యూస్.  రకుల్ కెరీర్ బాగా పీక్ లో ఉండగానే పెళ్ళి ప్రపోజల్స్ వచ్చాయట. అపుడు నో అన్న ఈ అమ్మడు ఇపుడు తయార్ అంటోందట. 


ఎటూ సరైన మూవీస్ చేతిలో లేవు. స్టార్ స్టాటస్   కూడా చూసేసింది. ఇక తాను హోదా తగ్గి చిన్న సినిమాలు చేయాలనుకోవడంలేదట. అందుకే పేరెంట్స్ కి ఆమె నేను పెళ్ళికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటి టాక్ నడుస్తోంది. అదే నిజమైతే అన్న గారి బయోపిక్ ఆమె చివరి మూవీ కావచ్చేమో


మరింత సమాచారం తెలుసుకోండి: