విజయ దేవరకొండ మ్యానియా ఇప్పడూ బాలీవుడ్ కు పాకింది. ఏకంగా మనోడు శ్రీదేవి కూతురు కు కూడా నచ్చినటుడన్నాడు . అయితే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు. ఇటీవల అర్జున్ కపూర్, జాన్వీ కాఫీ విత్ కరణ్ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు. 

 సెక్సీ స్టార్

ఈ షోలో రాపిడ్ ఫైర్ లో భాగంగా కరణ్ జోహార్.. జాన్విని ఓ ప్రశ్న అడిగారు. ఒక రోజు ఉదయం నిద్రలేవగానే పురుషుడిగా మారిపోవాలంటే ఏ నటుడ్ని ఎంచుకుంటావు అని అడిగాడు. దీనికి జాన్వీ కపూర్ తడుముకోకుండా.. విజయ్ దేవరకొండ అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాదు తనతో సినిమా చేయాలనే కోరికని కూడా బయట పెట్టింది. జాన్వీ సమాధానం విన్న తరువాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ గా మారాడని తెలిపారు. ఆ చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. విజయ్ దేవరకొండ సెక్సీ సౌత్ ఇండియన్ స్టార్ అంటూ కరణ్ జోహార్ కితాబిచ్చేశారు. ఈ షోతో జాన్వీ కపూర్, విజయ్ దేవరకొండ చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

కరణ్ జోహార్ నిర్మాణంలో

టాక్సీవాలా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాను కరణ్ జోహార్ ని ఆయన నివాసంలో కలిసినట్లు విజయ్ తెలిపాడు. ఇప్పుడు జాన్వీ కపూర్, కరణ్ జోహార్ ఈ సంచలన టాలీవుడ్ హీరోని ప్రశంసించడం చూస్తుంటే.. వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందా అనే వార్తలు వస్తున్నాయి. తాను బాలీవుడ్ లో నటించడానికి కూడా సిద్ధం అంటూ విజయ్ దేవరకొండ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: