విజయ్ దేవరకొండ సుడి తిరిగింది. లేటెస్ట్ మూవీ టాక్సీవాలాతో బంపర్ హిట్ కొట్టిన ఈ యూత్ హేరోకి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. టాలీవుడ్లో బిగ్ షాట్స్ గా ఉన్న పలువురు ప్రొడ్యూసర్లు విజయ్ తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికీ మెగా కాంపౌండ్ కి బాగా క్లోజ్ అయిన విజయ్ గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వంద కోట్ల హీరో అయిపోయాడు. టాక్సీ వాలాతో మరో మారు తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.


ఇపుడు విజయ్ తో మంచి కమర్షియల్ మూవీ చేసేందుకు టాప్ ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్ సన్నాహలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. విజయ్ తో అశ్వనీదత్ మూవీ అంటే మరో రేంజిలోకి ఆయన్ని తీసుకుపోయే మూవీయేనని చెప్పుకోవాలి. వైజయంతి మూవీస్ లో సినిమాలు చేసిన వారంతా స్టార్లు గా టాప్ ప్లేస్ లో ఉన్నరు. ఇపుడు ఆ సుడి విజయ్ వైపు తిరిగిందన్నమాట.
ప్రస్తుతం డియర్ కామ్రెడ్ మూవీ చేస్తున్న విజయ్ తదుపరి సినిమా అశ్వనీదత్ దేనని టాక్. ఇక నోటా దెబ్బతో స్టోరీ సెలక్షన్లోనూ విజయ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడుట.

తన మూవీ ఎలా ఉండాలన్నది గీతా గోవిందం, టాక్సీ వాలా చెప్పాయని, ఆడియన్స్ ఇష్టపడే విధంగా ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా మూవీస్ చేసుకుంటూ యూత్ కి కనెక్ట్ అయ్యే కధలతో ముందుకు వస్తానని విజయ్ ఇపుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఏ ముహూర్తాన మెగాస్టార్ చిరంజీవి విజయ్ ని స్టార్ క్లం లోకి ఇన్వైట్ చేశారో కానీ విజయ్ దశ తిరిగింది. తొందరలోనే టాప్ స్టార్ కాబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: