బుల్లితెర మీద కామెడీ షోగా వచ్చిన జబర్దస్త్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అందులో చేసే కమెడియన్స్ కు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయంటే ఆ కామెడీ షో ఎంత ఫేమస్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు ఐదేళ్లుగా నడుస్తున్న జబర్దస్త్ షో సూపర్ హిట్ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ఇక ఆ షో అంతగా హిట్ అయ్యేందుకు కమెడియన్స్ స్కిట్స్ తో పాటుగా అనసూయ యాంకరింగ్ కూడా ఓ కారణం అంటుంటారు. ఆమె చేసే యాంకరింగ్ కన్నా అమ్మడి స్కిన్ షో అదరిని అలరిస్తుంది. గ్లామర్ యాంకర్ గా అనసూయ కూడా ఈ షో వల్ల మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. మధ్యలో అనసూయ కొద్దిగా గ్యాప్ ఇచ్చే సరికి రష్మి కొన్నాళ్లు జబర్దస్త్ చేసింది.


మళ్లీ అనసూయ వచ్చాక రష్మి షో కూడా హిట్ అవడంతో ఆమెను ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి షిఫ్ట్ చేశారు. అనసూయ జబర్దస్త్, రష్మి ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇలా రెండు షోలు ఈటివికి మంచి రెవిన్యూ తెస్తున్నాయి. ఇదిలాఉంటే ఈమధ్య సినిమాల్లో బిజీ అవడం వల్ల అనసూయ జబర్దస్త్ కు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది.


ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా జబర్దస్త్ వదిలి వెళ్లని అనసూయ ప్రస్తుతం రెండు మూడు సినిమా అవకాశాలు వచ్చేసరికి అనసూయ మళ్లీ జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చింది. ఆమె ప్లేస్ లో కొత్తగా వర్షిణిని తెచ్చి పెట్టారు. అయితే లాస్ట్ వీక్, ఈ వీక్ వర్షిణి ఎపిసోడ్స్ జబర్దస్త్ ప్రేమికులకు తెగ నచ్చేశాయి. అనసూయ వద్దు వర్షిణినే యాంకర్ గా కొనసాగించండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ అంతగా బోర్ కొట్టేసిందా ఏంటి అంటూ జబర్దస్త్ మేనేజ్ మెంట్ ఆలోచనలో పడ్డది. మరి నిజంగానే వర్షిణిని కంటిన్యూ చేస్తారా లేక అనసూయనే కొనసాగిస్తారా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: