‘నా పేరు సూర్య’ ఘోర పరాజయం తరువాత అయోమయంలోకి వెళ్ళిపోయిన అల్లు అర్జున్ తనతో సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్న దర్శకులకు రకరకాల ప్రశ్నలతో టార్చర్ పెడుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు విక్రమ్ కుమార్ ను అతడు చెప్పిన కథకు సంబంధించి అనేక సందేహాలతో కన్ఫ్యూజ్ చేసిన బన్నీ విక్రమ్ కుమార్ కు నో చెప్పి ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ ల మూవీ ప్రాజెక్ట్ కథకు సంబంధించిన చర్చలతో రోజుకు ఒక టర్న్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి త్రివిక్రమ్ బన్నీ కథ గురించి ఆలోచనలు చేస్తూ ఉన్నా ఆకథ రకరకాల కారణాలతో ఒక కొలిక్కి రావడం లేదు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య అల్లు అర్జున్ ను కలిసిన ఒక తమిళ రచయిత చెప్పిన కథ బాగా నచ్చడంతో అల్లు అర్జున్ మళ్ళీ విక్రమ్ కుమార్ ను పిలిపించి ఆకథను వివరించినట్లు టాక్. దీనితో త్రివిక్రమ్ తో ప్రస్తుతం సినిమా చేస్తున్న బన్నీ ఇప్పుడు విక్రమ్ కుమార్ తో ఎప్పుడు సినిమా చేస్తాడు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇప్పుడు ఈ వార్తలు ఇండస్ట్రీ వర్గాలకు లీక్ అవ్వడంతో అల్లు అర్జున్ వ్యూహాత్మకంగా త్రివిక్రమ్ విక్రమ్ కుమార్ లను తన భవిష్యత్ సినిమాల డైరెక్టర్స్ గా కొనసాగిస్తూ వారిద్దరితో మైండ్ గేం ఆడుతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు అనుకోని పరిస్థుతులలో త్రివిక్రమ్ తో బన్నీకి కథ సెట్ కాకపోతే తిరిగి అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ వైపు యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: